Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Mangala Gauri Sakthi Peeth Information | History Temple timings Accommodation Pooja Details


అష్టాదశ శక్తిపీఠాలలో పదహారవ పీఠం అయిన శ్రీ మంగళ గౌరీ మహాశక్తీ పీఠం బీహార్ లోని గయా క్షేత్రం నందు కలదు. ఇక్కడ వెలసిన అమ్మవారు సర్వమంగళాదేవి. శ్రీ మాంగళ్యగౌరీ దేవిని దర్శించిన వారికీ సమస్త శుభములు కలుగును. క్షేత్రంలోని విష్ణు పాద దేవాలయమునకు సుమారు 1 కి.మి దూరమున గల నారాయణ ఛుహ అనే ప్రాంతంలో కొంత ఎతైన కొండ మీద శ్రీ మంగళగౌరీ పీఠం ఉంది. కొండపైకి చేరుటకు మెట్లు మార్గం, కొండ వెనుక నుంచి రోడ్ మార్గం కూడా కలదు. ఒకానొక సమయంలో శ్రీ మన్నానారయుణునికి విశ్వకర్మ విశేషమైన గదను బహుకరించెను. ఆ గదతో శ్రీహరి ఓ దుష్ట రాక్షసుని చంపి, ఆ గదను సంగమంలో కడిగేను. అందువలన ఆ నదికి గదాలోల తీర్థం అని పేరు వచ్చింది. గయలో పిండ ప్రధానం చేసి, శ్రీమాంగళ్యగౌరిదేవిని దర్శించుకుంటారు.

ఈ ఆలయ ప్రాముఖ్యత:
ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క స్తనములు పడిన చోటుగా ప్రసిద్ధి. ఈ విశాలమైన దేవాలయం,ఆలయం అంతా శిల్పలతో నిండి ఉంటుంది. ఈ క్షేత్రంలో అమ్మవారిని యంత్రరూపంలో పెద్ద అఖండరూపంలో,బంగారంతో తయారు చేసిన ముఖం రూపంలో ఉంటుంది. సుమారు 3 అడుగుల ఎత్తుగల ద్వారం గుండా గర్బగుడిలోనికి ప్రవేశం ఉంటుంది. అమ్మవారి స్తనములు పోలిన శిలకు పూజలు జరుగుతాయి. ప్రతి మంగళవారంనాడు విశేషంగా అమ్మవారి దర్శనం కొరకు వస్తారు. విజయదశమి, చైత్రమాసంలో విశేష పూజలు, ఉత్సహావాలు జరుగుతాయి. అమ్మవారి మందిరం ఎదురుగా ఉన్న మండపం నందు హొమాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీని పక్కనే శివాలయం కూడా ఉంది. మహిళలు  ప్రతి శ్రావణ మాసంలోను ఇక్కడ మంగళగౌరి వ్రతములను చేస్తారు. పిండప్రధాన క్షేత్రంగా గయా క్షేత్రం ప్రసిద్ధి చిందినది.

ఇక్కడ చూడలిసిన ఆలయాలు:
గర్భాలయం చుట్టూ ఉప ఆలయాలు ఉన్నాయి. ఇక్కడికి 1 కి. మీ దూరంలో విష్ణు పాదక్షేత్రం ఉంది. ఇక్కడికి కొంచెం దూరం లో సిద్ధార్థుడికి జ్ఞానోదయమైన బోధి వృక్షం ఉంది. ఇక్కడే సిద్ధార్థుడు బుద్దుడిగా మారాడు. గణేశఆలయం, శివుని గుడి మరియు జనార్ధనస్వామి, కాళిమాత ఆలయం కూడా చూడవలసిన ఆలయాలు.
Mangla Gauri Temple Timings:
Morning: 5 am to 12 pm
Evening:  4 pm to 9 pm
Mangla Gauri Temple Address:
Mangala Gauri Shakti Peetham,
Gaya,
Bihar 823001,
phone: 09448510493

Astadasa Shakti Peethas :


Girija Devi Shakti Peetham

Ujjain Mahakali Shakti Peeth

Pithapuram Puruhutika Shakti Peeth

Kamakhya Devi Shakti Peeth 


Famous Temples In State of Bihar, manglagowri devi temple information ,mangalagowri devi temple details,manglagowri temple information in telugu,famous temples in gaya,18 shakth peetas,shakti peetas,mangalya gauri temple information,manglagauri temple pdf file,Gaya mangalya devi temple details,sarva mangaladevi temple details,history of mangala gauri temple.gowri temple information in telugu. 

Comments

Post a Comment