Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Manikyamba Shakthi Peeth Draksharamam | Temple Timings Phone Numbers Accommodation

అష్టాదశ క్షేత్రాలలో 12 వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూడవ (పిఠాపురం, శ్రీశైలం) శక్తిపీఠం. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు 32కి. మీ దూరంలోను,రాజమండ్రికి 60 కి. మీ దూరంలో ఈ ద్రాక్షరామక్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడు. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం పేరుపొందినది. 

ఈ క్షేత్రాన్ని దక్షిణకాశిగా పిలుస్తారు. దక్షుడు పరిపాలించిన క్షేతం కాబట్టి దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చింది. ద్రాక్షారామ ప్రాంతాన్ని త్రిలింగపీఠం అందురు.
ఈ ఆలయ ప్రాముఖ్యత:
ఇక్కడ సతీదేవి కణత భాగం పడిన స్థలంగా చెపుతుంటారు. మాణిక్యాంబ అనగా మాణిక్యములతో సమానంగా,చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలను ప్రసాదించే అమృతమూర్తి మాణిక్యాంబ.దక్షణ యజ్ఞం చేసిన పవిత్ర  ప్రదేశం ఇది. శ్రీ మాణిక్యదేవి శక్తిపీఠ క్షేత్రంలో కొలువు తీరిన బంగారు స్వామిభీమేశ్వరుడు, మాణిక్యాంబ భీమేశ్వరుడు ఒకేసారి స్వయం ప్రతిష్ట పొందిన క్షేత్రమే ద్రాక్షారామం. ద్రాక్షారామం గోదావరి ఒడ్డున ఉంది. ఇక్కడ భీమేశ్వరుడు లింగాకారంలో ఉంటాడు.లింగం సగభాగం నల్లగా, సగభాగం తెల్లగా ఉంటుంది. మాణిక్యంబికా అన్న బాలిక స్వామికి తనను తాను అర్పించుకొని ఆయనకు దేవేరి అయినట్లు భీమేశ్వర దండకంలో ఉంది. స్వామి ఊరేగింపును కూడా మాణిక్యంబి గుడి చుట్టూ త్రిప్పి తీసుకువెళ్లడం ఆచారం. మహాశివరాత్రి, దేవినవరాత్రి, కార్తీకమాసం,ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు,ఉత్సహావాలు ఇక్కడ జరుగుతాయి.  శ్రీ మాణిక్యాంబ దేవాలయానికి చుట్టుప్రక్కల చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వర ఆలయాలు ఎనిమిది ఉన్నాయి. భీమేశ్వర ఆలయముకు వచ్చే యాత్రికులు మాణిక్యాంబ గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
Near By Famous Temples : 


 1. కోటిపల్లి సోమేశ్వరుడు ఈ క్షేత్రం ద్రాక్షారామం నుంచి 10 కి. మీ దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి ఆటో, బస్సు సౌకర్యం కలదు. పూర్తివివరములు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
Kotipalli Someshwara Temple
2. కోటిపల్లి నుంచి అయినవిల్లి (వినాయకుడు) ఈ క్షేత్రం నుంచి 7 కి .మీ దూరంలో ఉంది.
3. పిఠాపురం పాదగయ క్షేత్రం: ఈ క్షేత్రం ద్రాక్షారామం నుంచి 47 కి. మీ దూరంలో ఉంది. పూర్తివివరములు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
Pithapuram Padagaya Information 

Famous Temples In East Godavari District

Manikyambha Devi Temple Timings:
Morning :5 am to 12 pm
Evening :4 pm to 9 pm

Temple Address:
Click Here : Draksharamam Google Map
Manikyabha Devi Shaktipeetam,
Draksharamam,
Ramachandrapuram Mandal,
East Godavari District,
Andhra Pradesh.

             

manikyamba devi temple details,manikyambika devi temple information in telugu,manikyamba temple pdf file,history of manikyambika shakthipeetam,18 shakthi peetas,sakthipeetas in telugu,draksharamam temple information,famous temples in draksharamam. famous temples in east godavari, eastgodavari, east godavari temples,Sri Manikyamba Shakthi Peeth Draksharamam. Draksharamam Temple Information in Telugu. 

Comments

Post a Comment