Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Kasi Vishalakshi Temple Shakti Peeth Varanasi | Varanasi Tour Details Rooms Phone Numbers

అష్టాదశ శక్తిపీఠాలలో 17 వ శక్తిపీఠం శ్రీ విశాలాక్షిదేవి శక్తిపీఠం. విశాలాక్షి అనగా విశాలమైన కన్నులు కలది అని అర్ధం. విశాలాక్షి దేవి కొలువుదీరిన అత్యంత పుణ్యప్రదమైన క్షేత్రం వారణాసి. అమ్మ కొలువైన శక్తీ క్షేత్రం కాశి. కాశీ క్షేత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాశినే వారణాసి అందురు. వరుణ మరియు అసి అను నదులు కలసి ప్రవహించే ప్రదేశమే వారణాసి. 

కాశీ విశ్వేశ్వరుని గుడికి కొంత దూరంలో నే విశాలాక్షి అమ్మవారి క్షేత్రం ఉంది. ఈ గుడి గోపురం అంతా దక్షిణాది సంప్రదాయంలో ఉంటుంది. సప్తమోక్ష పురాణలలో ఒకటిగా కాశి కి విశిష్ట స్థానం ఉంది. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా ఈ క్షేత్రం పేరు పొందినది.
ఈ ఆలయం ప్రాముఖ్యత:
ఇది సతీదేవి మణికర్ణిక పడిన ప్రదేశం కాబట్టి అందువల్ల శ్రీ విశాలాక్షి శక్తిపీఠం ఆవిర్భవించినదని పురాణాలు చెబుతున్నాయి. గంగానది తీరంలో  కాశీ నగరం ఉంది. ఆ దివ్య క్షేత్రం నందు అన్నపూర్ణా విశ్వేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయాలకు రెండు వీధులు దక్షిణంగా ఉండే వీధిలో విశాలాక్షి అమ్మవారిగుడి ఉంది. ఈ గుడి చిన్నది. గుడిలో అమ్మవారు బంగారు తొడుగుతో దర్శనం ఇస్తారు. పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలోని పార్వతీదేవి అన్నదానం చేయడంతో పార్వతీదేవిని అన్నపూర్ణగా అని పిలుస్తారు. ఆ తల్లి కాశీలోని అన్నపూర్ణగా ఉంటూ,మరొక అంశంతో కంచిలో  కామాక్షిమాతగా కొలువుతీరింది. కాశిలో మరిణించినవారికి శివుడు వారి ఆత్మ చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడని అంటుంటారు.
ఇక్కడ చూడలిసిన ఆలయాలు :

అమ్మవారి గుడి చుట్టూ శివలింగాలు ప్రతిష్టించి ఉంటాయి. గర్భగుడిలో అమ్మవారితోబాటు ఆదిశక్తి దేవి కూడా కొలువై ఉంది. అమ్మవారి ఎదురుగ ఉన్న మహిమాన్వితమైన శ్రీ చక్రం భక్తులు తాకి దర్శించుకోడానికీ అందుబాటులో ఉంటుంది. కాశీలో ఏడు ఆవరణలలో 56 గణపతులున్నారు. అందులో డుంఢిరాజగణపతి ప్రసిద్ధి. ఈయనే కాశీలోని ఏడు ప్రాకారాలలోను యాభై ఆరు గణపతులుగా రూపమెత్తి విరాజిల్లాడని పురాణాలలో చెప్తుంటారు. ఇందు పదిగణపతులకు ప్రాధాన్యం ఉంది. మార్కండేయమాధవ్ టెంపుల్,భరతమాత మందిర్, కాలబైరవ టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, దుర్గగుడి, బిర్లా టెంపుల్, వ్యాస టెంపుల్ ,తిలభణ్డేశ్వర్ టెంపుల్, ఇంకా చూడవలసిన గుళ్ళు గోపురాలు ఎన్నో పుణ్యక్షేత్రాలు వారణాసిలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
వారణాసి లో మోసపోకుండా ఉండండి. 

కాశి గంగ ప్రత్యేకత ఏమిటి?

విశాలాక్షి అని ఎందుకు పిలవడం?

అన్నపూర్ణ దేవిని ఏమని అడగాలి?

కాశి మొదటిసారి వెళ్ళే వారికోసం

వారణాసి చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్ర విశేషాలు

Click hereAccommodation in Varanasi

Vishalakshi Devi Temple Timings:
Morning : 5 am to 12 pm
Evening  :4 pm to 9 pm

Varanasi Vishalakshi Devi Temple Address:
Lahori Tola,
Varanasi,
Uttar Pradesh 221001.



varanasi vishalakshi devi temple information,vishalakshidevi temple information in telugu,visalakshidevi temple details,history of varanasi vishalakshi temple,famous temples in varanasi,18 shakthipeetas, akthipetalu, vishalakshi temple pdf file, sri kasi varanasi visalakshi temple information.kasi visalakshi temple

Comments

Post a Comment