Drop Down Menus

Sri Saraswathi Shakti Peeth Kashmir | History Temple Timings Accommodation Phone Numbers


అష్టాదశ శక్తీ పీఠాలలో చివరి శక్తిపీఠం శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం.  కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న శక్తిపీఠాన్ని సరస్వతీ పీఠంగా చెబుతారు. కాశ్మీర్ లోని స్థానికులు సరస్వతీ దేవిని కీర్ భవాని అని పిలుస్తారు. 

కీర్ భవాని ఆలయం శ్రీనగర్ కు పది కి. మీ దూరంలో ఉంది. శ్రీ సరస్వతీ పరమశాంతమూర్తి, శ్రీ హరిప్రియ, నాలుగు చేతులతో వీణా,పుస్తక జపమాల ధరించి అభయ ముద్రతో ప్రకాశిస్తుంది. కాశ్మీర్ ప్రాంతంలో అనేక శక్తీ పీఠాలు కలవు. వాటిని ప్రతివారు సరస్వతీ పీఠంగా చెబుతారు. వీటిలో ముఖ్యమైన స్థానం శారికాదేవి మందిరం. ఇది హరి పర్వతం పై ఉంది. అమ్మ అద్భుతమైన మౌనశీల రూపంలో దర్శనమిస్తుంది. ఇదే సరస్వతీ పీఠంగా భక్తులు కొలుస్తారు.
ఈ ఆలయ ప్రాముఖ్యత:
సతీదేవి కుడి చెంప భాగం కాశ్మీర్ ప్రాంతంలో పడినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ అమ్మవారిని శారికాదేవి అమ్మవారుగా స్థానికులు కొలుస్తారు. ఇక్కడ అమ్మవారు మౌన శిలలో ఒక మూలానగల గుంటలో నీరు ఉద్బవిస్తుంది. ఆ గుంటలో ఎంత నీరు మనము తీసుకుంటే,అంత నీరు మళ్ళీ పుడుతుంది. భక్తులు ఈ నీటిని తీర్థంగా తీసుకుంటారు. ఆషాడమాసంలో శుక్ల నవమితో కూడిన శనివారం నాడు మౌన చక్రం దర్శనం కోసం అనేక మంది భక్తులు వస్తారు. హరిపర్వతం చేరుటకు బస్సు సర్వీసులు ఉన్నాయి .
ప్రకృతి, వైపరీత్యాలకి సరస్వతీ ఆలయం శిధిలమైనదని ఆదిశంకరాచార్యులవారు ఇక్కడ అమ్మవారి శక్తినీ సువర్ణ శారదాదేవి రూపంలో మరియు యంత్రము లో ఆవాహన చేసి కర్ణాటకలోని శృంగేరి క్షేత్రానికి తరలించారు అని పురాణాలు ద్వారా తెలుస్తుంది.

ఇక్కడ చూడవలసిన ఆలయాలు:
జమ్మూకాశ్మీర్ లో జమ్మూ నుంచి 60 కి. మీ. దూరంలో కొండ గుహ ఉంది. ఇదే వైష్ణవీదేవి నెలకొన్న పుణ్యక్షేత్రం. కాశ్మీర్ శ్రీనగర్ లో ఒక్క డాల్ సరస్సు,మరో పక్క ఆకాశాన్ని అంటుతున్న బ్రహ్మాండమైన 1000 అడుగుల ఎత్తుగా ఉండే శంకరాచార్యా పర్వతం,జ్యేష్టేశ్వరాలయం ఇది గొప్ప శివాలయం. పురమండల్  ఇది జమ్మూకి 50 కి.మీ దూరంలోఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గయ క్షేత్రంగా భావింపబడుతుంది. ఇది దేశిక నది తీరంలో ఉంది. ఇక్కడ స్వామి ఉమాపతి. శుద్దమహాదేవ్ శ్రీనగర్ పోవు మార్గంలో జమ్ముకు 16 కి. మీ దూరంలో ఉంది. ఇక్కడ శుద్దమహాదేవ్ కొలువై వున్నారు. ఇంకా అనేక ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.
ఇవి చదివారా ?
Shankari Devi Temple శంఖరి శక్తిపీఠం
Kamakshi Amman Temple కాంచీపురం కామాక్షి అమ్మవారు
Jwalamukhi Temple
Chamundeshwari Temple శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం
Jogulamba Devi శ్రీ జోగులాంబ శక్తి పీఠం
Bhramaramba Mallikarjuna Temple భ్రమరాంబదేవి శక్తిపీఠం
Mahalakshmi Temple శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం
Ekveera Temple శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం
Mahakaleswar Temple శ్రీ మహాకాళిదేవి శక్తిపీఠం
Kukkuteswara Swamy Temple శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం
Biraja Temple శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం
Bhimeswara Temple శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం
Kamakhya Temple శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం
Alopi Devi Mandir శ్రీ మాధవేశ్వరీ దేవీ శక్తీ పీఠం
Jwalamukhi Temple
Mangla Gauri Temple శ్రీ మంగళ గౌరీ మహాశక్తీ పీఠం
Vishalakshi Temple విశాలాక్షిదేవి శక్తిపీఠం
Sharada Peeth శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం
శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం
శ్రీ నైనాదేవి శక్తిపీఠం
శ్రీ కుమారి దేవి శక్తిపీఠం
శ్రీ భ్రామరి దేవి శక్తిపీఠం
jothirlingas జ్యోతిర్లింగాలు

Temple Timings:
Morning: 5 am to 12 pm
Evening:  4 pm to 9 pm
Sharada devi Temple Address:
Saradha Devi Shakthi Peeth,
Kashmir.


saraswathi shakti peeth, sarada devi temple information,saraswathi temple details,sharadadevi temple information in telugu,famous temples in kashmir,sharada devi temple pdf file,18 shakthipeetas, sakthipeetalu, history of sharada devi shakthi peet.18 shakti peethas information in telugu. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Ee pai photo lo unnadi Pakistan Occupied Kashmir lo unnadi 150 kms from Srinagar sraswati peetham ga pilavabadda Saraswati ammavaru undevaru ikkada whereas Kheer bhavani pehalhaum tovalo vastundu...POK lo unnadi sidhilamaindi paiga ammavarini Sringeri taralincharu Sankarulu...ikkada POK lo unna aa sidhilamaina gudilo roju deepam aite veligistaru but visitors ki anta suluvu kadu velladam...

    ReplyDelete

Post a Comment