Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Kamakhya Devi Sakthi Peetam Assam | Temple History Accommodation Pooja Details


అష్టాదశ శక్తిపీఠాలలో 13 వ శక్తీ పీఠం శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం. మనదేశంలోని అస్సాం నందలి గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల కొండల వద్ద ,బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఈ కామఖ్య అమ్మవారు వెలసినది. ఈ అమ్మవారిని  కామరూపాదేవి అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ ఆలయాన్ని రాజవంశులు నిర్మించారు. ఆలయం లోపల అంత  పెద్ద గుహ,ఆ గుహలోకి వెళ్లాక ఇంకా లోపలికి వెళ్ళినట్లైతే భూగర్భంలోనికి మెట్లు ఉంటాయి. గర్భాలయంలోని మూడు అడుగుల చదరంగాను,ఒకటిన్నర అడుగులోతున గుంట ఉన్నది. ఈ గుంట లోపల ఉన్న రాతి నేలపై యోని ముద్ర కనిపిస్తుంది. అదే అమ్మవారి రూపం ఈ రూపం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడ నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. దీనినే తీర్థంగా సేవిస్తారు.

ఈ ఆలయ ప్రాముఖ్యత:
పురాణాల ప్రకారం  ఇక్కడ శివుని కోసం సతీదేవి తన సోగసును ఆర్పించిన ఏకాంత ప్రదేశం అని  చెప్తుంటారు. మరియు శివుడు సతీదేవి శవంతో నృత్యం ఆడినపుడు ఆమె యోని పడిన స్థలం ఇది. ఇక్కడ కామాఖ్య అమ్మవారిని కాళికా అమ్మవారితో పోలుస్తారు. ఇక్కడ అమ్మవారు సంవత్సరంలో మూడు రోజులు రజస్వల అవుతారు. ఆ సమయంలో  శిల నుంచి వచ్చే నీరు ఎర్రగా మారుతుందని చెపుతారు. ఈ మూడు రోజులు పూర్తిగా గుడిని మూసివేస్తారు. నాలుగవ రోజు గుడిని అంతా శుభ్రం చేసి అమ్మవారి పండుగలు జరుపుతారు. దీనినే అంబుజమేళా పండుగ అంటారు. మరొక వారికోత్సవం  మానసపూజ,నవరాత్రి సమయంలో దుర్గాపూజను కూడా కామాఖ్య ఆలయంలో వార్షికంగా నిర్వహిస్తుంటారు. ఇది ఐదు రోజుల పండుగ. అనేక వేలమంది భక్తులు ఇక్కడికి  వచ్చి అమ్మవారిని దర్షించుకొంటరు.
చూడవలసిన ఆలయాలు :
దేవాలయం గర్భ గుడిలో మాతంగి,కమల అమ్మవార్లు,భువనేశ్వరి,బంగాళముఖ,చిన్నమస్తా,త్రిపుర సుందరి మరియు  తార వగడ ,ధూమవతి,కాళీ,భైరవి మరెన్నో ఆలయాలు అలాగే శివాలయలు కూడా ఉన్నాయి.
Temple Timings :
Morning : 5 am to 12 pm
Evening : 4 pm to 8 pm
Kamakhya Devi Temple Address:
Kamakhya Temple,
Guwahati, 
Assam 781010,
Temple Phone Number : 0361 273 4624

Kamakhya Devi Temple Google Map :

Click Here


Related Temples Articels: 

18 Shakti Peethas Information

Jogulamba Shakti Peetham Informaiton

Chamundeshwari Temple Mysore 

Kolhapur Mahalakshmi Temple
keywords : sakti pitham, sakthi peetam, shakti pitham, shakti peetham, 18 shakti peetam information, information in telugu, famous temples in assam, popular temples in assam, kamakhya temple route map, kamarupa devi, kamakhya devi shakti peetham information in telugu, kamakhya devi history. 

Comments

Post a Comment