తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్స్ కొత్త రూల్స్ | Tirumala Arjitha Brahmotsavam Ticket Booking Darshan New Rules
ఓం నమో వేంకటేశాయ.. తిరుమల గురించి ఎంత చెప్పుకున్నా ఏదోకటి మిగిలే ఉంటుంది. తిరుమల ఆర్జిత సేవల్లో ఒకటైన ఆర్జిత బ్రహ్మోత్సవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్జిత బ్రహ్మోత్సవం గురించి సాధారణంగా అడిగే ప్రశ్నలు వాటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్స్ కొండపైన ఎక్కడిస్తారు?
ఈ టికెట్స్ మనం ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి , కొండపైన అప్పటికప్పుడు ఇవ్వరు.
ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు ?
మూడు నెలల ముందే ఈ టికెట్స్ విడుదల చేస్తారు , ప్రతి నెల 21 లేదా 22న చేస్తారు . మీరు హిందూ టెంపుల్స్ గైడ్ ను ఫాలో అవుతున్నారు కాబట్టి ఎప్పటికప్పడూ మేము అప్ డేట్ చేస్తాము , యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోండి.
ఈ టికెట్ కు ఎక్కడ నుంచి దర్శనం ఇస్తారు ?
ఆర్జిత సేవ లు ఏవి బుక్ చేసుకున్నా , వారికి సుపథం నుంచి ప్రవేశం ఉంటుంది , దర్శనం జయ విజయాలు దగ్గర నుంచి ఉంటుంది.
ఆర్జిత బ్రహ్మోత్సవం బుక్ చేసుకున్న వారికి మొదటి గడప దర్శనం ఉంటుందా ?
ఉండదు , 300/- దర్శనం లో ఎక్కడుంచి చూస్తామో అక్కడ నుంచే దర్శనం ఉంటుంది .
ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ ధర ఎంత ? చిన్నపిల్లలను తీసుకుని వెళ్లవచ్చా ?
టికెట్ ధర ఒక్కరికి 500/- రూపాయలు , పిల్లలను తీసుకుని వెళ్ళవచ్చు
ఈ టికెట్స్ దంపతులే బుక్ చేసుకోవాలా ? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా ?
దంపతులే కానవసరం లేదు , ఎవరైనా ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు .
సింగల్ గా ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ బుక్ చేసుకోవచ్చా ?
మీరు సింగల్ గా కూడా బుక్ చేసుకోవచ్చు .
ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్స్ ఒకేసారి ఎన్ని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ?
మీరు ఒకేసారి 2 టికెట్స్ అనగా ఇద్దరికీ మాత్రమే చేయగలరు
ఆర్జిత బ్రహ్మోత్సవం లో పిల్లలకు స్పెషల్ దర్శనం ఏమైనా ఉంటుందా ?
స్పెషల్ దర్శనం ఏమి ఉండదు , 12 సంవత్సరాల లోపు పిల్లలను టికెట్ లేకుండా తీసుకుని వెళ్ళవచ్చు .
ఈ సేవ ఎన్ని గంటలకు ఉంటుంది , ఎక్కడ ఉంటుంది ?
ఈ సేవ మధ్యాహ్నం 2:30 pm కు ఉంటుంది , సేవ అరగంట పాటు జరుగుతుంది . స్వామి వారి ఆలయం కు ఎదురుగా ఉన్న వసంత మండపం లో ఈ సేవ జరుగుతుంది. రాంబగీచా బక్కన ఉంటుంది , ఇంకా సులువుగా చెప్పాలంటే ఆలయం కు ఎదురుగా రథం పెట్టడానికి షెడ్ కనిపిస్తుంది కదా ఆ పక్కనే ఈ బిల్డింగ్ కనిపిస్తుంది.
ఈ సేవకు ఏమైనా డ్రెస్ కోడ్ ఉందా ?
ఆర్జిత సేవలు అన్నింటికీ కూడా మీరు సాంప్రదాయ దుస్తులనే ధరించాలి .
ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ తీసుకున్న వారు 300/- టికెట్ కూడా తీసుకోవచ్చా ?
ఆర్జిత సేవ లు ఏవి బుక్ చేసిన మీరు 300/- టికెట్ తీసుకోవచ్చు .
ఒకరోజు ఆర్జిత బ్రహ్మోత్సవం మరుసటి రోజు కళ్యాణం టికెట్ తీసుకోవచ్చా ?
ఆ విధంగా తీసుకోవడానికి అవకాశం లేదు , ఆర్జిత సేవల మధ్య 90 రోజులు గ్యాప్ ఉండాలి.
ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ ఉంటే లక్కీ డ్రా లో పాల్గొనవచ్చా ?
మీరు లక్కీ డ్రా లో పాల్గొనవచ్చు .
ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి .
Tirumala Arjitha Sevas Information
తిరుమల ఆర్జిత సేవల వివరాలు |
---|
కళ్యాణం టికెట్స్ వివరాలు |
ఉంజల్ సేవ వివరాలు |
ఆర్జిత బ్రహ్మోత్సవం |
సహస్ర దీపాలంకర సేవ |
ఆన్ లైన్ ఆర్జిత సేవ లు |
#tirumala arjitha brahmotsavam darshanam ticket booking rules full details hindu temples guide
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment