Drop Down Menus

తిరుమల ఆర్జిత సేవల్లో టికెట్ లేకపోయినా అందరూ చూసే ఏకైక సేవ | Tirumala Arjitha Seva Information Sahasra Deepalamkara Seva

హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. మనం తిరుమల ఆర్జిత సేవల గురించి తెలుసుకుంటున్నాం ఇప్పటివరకు కళ్యాణం , ఉంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సహస్ర దీపాలంకర సేవ గురించి తెలుసుకుందాం.


 తిరుమల ఆర్జిత సేవల్లో టికెట్ లేకపోయినా అందరూ చూసే ఏకైక సేవ ఏదైనా ఉందంటే అది సహస్ర దీపాలంకర సేవ ఒకటే. ఈ సేవ ప్రతి రోజు సాయంత్రం
5:30 pm -6:30 pm వరకు స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న దీపాలంకర మండపం లో ఈ సేవ జరుగుతుంది. సహస్ర దీపాలంకరణ సేవ గురించి సాధారణంగా అడిగే ప్రశ్నలు వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ ఎలా బుక్ చెయ్యాలి ?

ఈ టికెట్స్ మూడు నెలల ముందే విడుదల చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు లో మనం బుక్ చేసుకోవాలి. కొండపైన అప్పటికప్పుడు ఇవ్వరు

ఈ టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చా ? దంపతులే చేసుకోవాలా ?

ఈ టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు , దంపతులే బుక్ చేసుకోవాలనే రూల్ లేదు 

సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్  ఒక్కరైనా బుక్ చేసుకోవచ్చా ?

మీరు సింగల్ గా కూడా బుక్ చేసుకోవచ్చు 

ఈ సేవలకు పిల్లలను పంపిస్తారా ?

పిల్లలను కూడా తీసుకుని వెళ్ళవచ్చు , 12 సంవత్సరాల లోపు వారికి టికెట్స్ అవసరం లేదు 

ఈ సేవ బుక్ చేసుకుంటే మొదటి గడప దర్శనం ఇస్తారా ?

మొదటి గడప దర్శనం ఉండదు . 

ఈ సేవ బుక్ చేస్తే దర్శనం త్వరగా అవుతుందా ?

సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేస్తే మీరు సేవ అయినతరువాత సేవ అనగా దీపాల మండపం లో దీపాలన్నీ వెలిగించి స్వామి వారిని ఉయ్యాలా ఊపుతూ కీర్తనలు , పాటలు పాడి హారతి ఇస్తారు. ఆ తరువాత టికెట్ తీసుకున్న వారి సుపథం నుంచి దర్శనానికి పంపిస్తారు. దర్శనం త్వరగా అవుతుంది. 300/- లైన్ కంటే ఈ దర్శనం 1-2 గంటల లోపే దర్శనం అవుతుంది. 

మేము సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేసాము ? తరువాత రోజు కానీ ముందు రోజు కానీ 300/- దర్శనం టికెట్ బుక్ చేయవచ్చా ?

మీరు బుక్ చేసుకోవచ్చు , అదే విధంగా కొండపైన cro ఆఫీస్ లో ఇచ్చే లక్కీ డ్రా టికెట్స్ కూడా మీరు తీసుకోవచ్చు . 

సహస్ర దీపాలంకరణ సేవ  కు ఏమైనా డ్రెస్ కోడ్ ఉంటుందా ?

ఉంటుంది మీరు సాంప్రదాయ దుస్తులను ధరించాలి. 

ఈ టికెట్ బుక్ చేసుకుంటే రూమ్ ఇస్తారా ?

మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు , కాకపోతే ఈ సేవకంటూ ప్రత్యేక కోట ఏమి ఉండదు. 

మాకు సేవ టికెట్స్ ఉన్నాయి మా పిల్లలకు దొరకలేదు , 300/- టికెట్స్ బుక్ చేసాము అందరిని  సుపథం నుంచి పంపిస్తారా ?

సేవ టికెట్స్ ఉన్నవారిని మాత్రమే పంపిస్తారు . మీరు కూడా సుపథం దగ్గర అడిగి చూడండి.

తిరుమల మొదటి గడప దర్శనాలు
సుప్రభాత సేవ టికెట్స్ వివరాలు
తోమాల సేవ టికెట్స్ వివరాలు
అర్చన సేవ టికెట్స్ వివరాలు
అష్టదళ టికెట్స్ వివరాలు
తిరుప్పావడ టికెట్స్ వివరాలు
మెల్చట్ వస్త్రం టికెట్స్ వివరాలు
శ్రీవాణి టికెట్స్ వివరాలు

Tirumala Arjitha Sevas Information

తిరుమల ఆర్జిత సేవల వివరాలు
కళ్యాణం టికెట్స్ వివరాలు
ఉంజల్ సేవ వివరాలు
ఆర్జిత బ్రహ్మోత్సవం
సహస్ర దీపాలంకర సేవ
ఆన్ లైన్ ఆర్జిత సేవ లు 

Tirumala Srivari Seva Information

తిరుమల సేవ (డ్యూటీ ) లు 
శ్రీవారి సేవ బుకింగ్ కొత్త రూల్స్
నవనీత సేవ బుకింగ్ కొత్త రూల్స్
పరకామణి సేవ బుకింగ్ కొత్త రూల్స్

ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. 

#tirumala sahasra deepalamkara seva ticket darshan full details. hindu temples guide tirumala information. 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.