తిరుమల 300/- టికెట్స్ కొండపైన కానీ తిరుపతి లో కానీ అప్పటికప్పుడు ఇస్తారా ?
చాలామంది అలానే అనుకుంటారు అక్కడ దొరకవు . ఇంతకూ ముందు రైల్ వే స్టేషన్ లో ఇచ్చేవారు అని చెబుతారు ఇప్పుడు ఆన్ లైన్ లోనే ఇస్తున్నారు .
300/- టికెట్స్ ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలంటే ఎప్పుడు చెయ్యాలి ?
ఆన్ లైన్ లో మూడు నెలల ముందే టికెట్స్ విడుదల చేస్తారు , ప్రస్తుతం ప్రతి నెల 23 /24 తేదీలలో విడుదల చేస్తున్నారు . ఎప్పటికప్పుడు సమాచారం మన హిందూ టెంపుల్స్ గైడ్ మీకు ఇస్తాము.
300/- టికెట్స్ అందరికి తీయ్యాల ?
తిరుమల తిరుపతి దేవస్థానం వారు 12 సంవత్సరాల లోపు వయస్సు వారికి ఉచితంగా దర్శనం ఇస్తున్నారు కాబట్టి మీరు 12 సంవత్సరాల లోపు వారికి టికెట్ తీయనవసరం లేదు.
ఒకే సారి ఎంతమందికి టికెట్ బుక్ చేసుకోవచ్చు ?
ఒకసారి ఆరుగురికి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు . ఇంకా ఎక్కువ కావాలంటే వేరే మొబైల్ నుంచి వేసుకోవాలి
300/- దర్శనం టికెట్స్ ఒక నెలలో ఎన్ని సార్లు బుక్ చేసుకోవచ్చు?
300/- టికెట్ బుక్ చేస్తే మరల 30 రోజులు వరకు చేయడానికి లేదు.
మేము 6 టికెట్స్ బుక్ చేసాము వారి లో ఇద్దరు రావడం లేదు వేరే వారిని తీసుకుని వెళ్లవచ్చా ?
టీటీడీ రూల్స్ ప్రకారం ఎవరి పేరున బుక్ చేసారో వారిని మాత్రమే దర్శనానికి పంపిస్తారు , టికెట్స్ బదిలీ చేయడానికి లేదు.
మేము టికెట్ బుక్ చేసుకున్నాము వెళ్ళడానికి కుదరడం లేదు కేన్సిల్ చేయడం ఎలా ?
300/- దర్శనం టికెట్స్ ఒకసారి బుక్ చేస్తే డేట్ మార్చడానికి కానీ కేన్సిల్ చేయడానికి కానీ లేదు మీకు డబ్బులు తిరిగి ఇవ్వరు.
మేము టికెట్ తో పాటు లడ్డులు కూడా బుక్ చేసాము దర్శనికి వెళ్ళలేదు లడ్డులు ఇస్తారా ?
దర్శనం అవ్వకపోతే ప్రస్తుతం లడ్డులు ఇవ్వడం లేదు.
నేను మా బంధువులం టికెట్స్ బుక్ చేసాము వాళ్ళకి వేరే టైం స్లాట్ , నాకు వేరే టైం స్లాట్ వచ్చింది ఇద్దరం ఒకేసారి వెళ్లవచ్చా ?
తేదీ మారకుండా వెళ్ళవచ్చు
దర్శనం టైం కన్నా ఎంత ముందు వెళ్ళవచ్చు ?
ఆ రోజు రద్దీని బట్టి ఉంటుంది , సాధారణంగా మనం బుక్ చేసిన స్లాట్ టైం కన్నా ఒక గంట ముందు పంపిస్తారు. మీరు నేరుగా దర్శనం లైన్ కి వెళ్తే అక్కడ టీటీడీ అధికారులు లేదా శ్రీవారి సేవ కులు నిలబడి , ఏ టైం స్లాట్ వారిని పంపిస్తున్నారో చెబుతుంటారు దానిని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు .
టికెట్స్ ఆన్ లైన్ లో అయిపోయాయి వేరే మార్గం ఏదైనా ఉందా ?
టీటీడీ వెబ్సైటు లో మీకు దొరకకపోతే మీరు RTC, TRAIN IRCTC లో ప్రయత్నించండి.
దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి ?
మీకు బుక్ అయిన టికెట్ ప్రింట్ తీసుకోండి , అందరివీ ఆధార్ కార్డు లు ఉండాలి , ఒరిజినల్ ఉంటే మంచిది లేదా జిరాక్స్ అయినా పర్వాలేదు. సంప్రదాయ దుస్తులు ధరించి ఉండాలి.
టికెట్ బుకింగ్ లో పొరపాటున పేరు తప్పుగా పడింది ఎలా ?
బుకింగ్ లో సాధారణంగా ఇలా జరుగుతుంటాయి . చిన్న చిన్న స్పెలింగ్ మిస్టేక్స్ ఉంటే పర్వాలేదు . ఆధార్ కార్డు నెంబర్ మాత్రం జాగ్రత్తగా టైపు చేయండి.
తిరుమల వెబ్సైటు ఏది ?
https://ttdevasthanams.ap.gov.in/home/dashboard
ఇంకా ఏమైనా సందేహాలు ఉంటె 8247325819 వాట్స్ యాప్ నెంబర్ కు మెసేజ్ చేయండి.
హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
tirumala 300 special darshan tickets rules, special darshan ticket time limit, special darshan latest updates. tirumala guide, hindu temples guide,