తిరుమల దర్శనం టికెట్స్ లేకుండా వెళ్తున్నారా ? | Tirumala Free Darshan Rules SSD Counters List Update

ఓం నమో వేంకటేశాయ . హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. ఇప్పుడు మనం ఉచిత దర్శనం గురించి తెలుసుకుందాం . ఉచిత దర్శనం తెలుసుకునే ముందు టీటీడీ వారు విడుదల చేసే టికెట్స్ గురించి ఒకసారి తెలుసుకుంటే మీరు ఆ టికెట్స్ కూడా బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు.
TIRUMALA FREE DARSHAN RULES
 తిరుమల దేవస్థానం వారు ప్రతి నెల టికెట్స్ విడుదల చేస్తుంటారు . ఆ సమయం లో విడుదల చేసే టికెట్స్ వరుసగా 

1) మొదటి గడప లక్కీ డ్రా టికెట్స్ :

ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తారు . వీటిలో సుప్రభాతం , తోమాల , అర్చన , అష్టదళ పాద పద్మారాధన సేవ లు ఉంటాయి . మనం డ్రా లో మన పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి సెలెక్ట్ అవితే అమౌంట్  కట్టాలి .

2) ఆర్జిత సేవ టికెట్స్ : 

విడుదల చేసిన వెంటనే మనం బుక్ చేసుకోవచ్చు డ్రా కాదు . ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి బుక్ అవుతాయి . ఆర్జిత సేవ లో నాలుగు రకాల సేవలకు విడుదల చేస్తారు అవి కళ్యాణం , ఊంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకర సేవ . 

3) అంగ ప్రదక్షిణ ( ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే ఇస్తున్నారు )

4) వయో వృద్దులు , వికలాంగుల టికెట్స్ ( ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే ఇస్తున్నారు )

5) 300/- దర్శనం టికెట్స్ 

6) రూమ్స్ 

ఈ విధంగా విడుదల చేస్తారు . మూడు నెలల ముందే ఇవి విడుదల అవుతాయి . 

ఉచిత దర్శనం రెండు రకాలు ,  కొండపైన ఫ్రీ దర్శనం ( సర్వదర్శనం ) లైన్ లో నిలబడటం , కొండ క్రింద అనగా తిరుపతి లో సర్వదర్శనం టికెట్స్ తీసుకోవడం . 

సర్వదర్శనం టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తారు ?

1) విష్ణు నివాసం ఇది రైల్ వే స్టేషన్ కు ఎదురుగా ఉంటుంది 2) శ్రీనివాసం ఇది బస్సు స్టాండ్ కు దగ్గర్లో ఉంటుంది. 3) భూదేవి కాంప్లెక్స్ , అలిపిరి మెట్ల మార్గం లో వెళ్లేవారికి ఇక్కడ ఇస్తున్నారు . 4) శ్రీవారి మెట్టు , శ్రీవారి మెట్ల మార్గం లో వెళ్లేవారికి మెట్ల మార్గం మధ్యలో ఇచ్చేవారు ఇప్పుడు క్రిందనే ఇస్తున్నారు. 

ఏ సమయం నుంచి ఇస్తారు ?

ప్రతి రోజు 3 గంటలకు కౌంటర్లు ఓపెన్ చేస్తారు . టికెట్స్ అయిపోయేవరకు ఇచ్చి కౌంటర్ క్లోజ్ చేసి మర్నాడు మరల ఓపెన్ చేస్తారు . 

ఏ సమయం వరకు దర్శనం టికెట్స్ ఇస్తారు ?

టికెట్స్ అయిపోయేవరకు ఇస్తారు ఒక్కోరోజు ఒక్కోలా ఉంటుంది 5am లోపు వెళ్లేవారికి దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి ఉదయం 7 గంటల వరకు కూడా ఉంటాయి ఎప్పటివరకూ అనేది చెప్పలేము. రద్దీని బట్టి ఉంటుంది. 

దర్శనం టికెట్ ఈ రోజు తీసుకుంటే ఈ రోజే దర్శనం అవుతుందా ?

దర్శనం టికెట్స్ ఏ రోజుకి ఆ రోజే ఇస్తున్నా దర్శనం టైం మాత్రం మరుసటి రోజు 3am వరకు ఇస్తున్నారు . మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే నేను మంగళవారం  ఉదయం 5 గంటలకు టికెట్ తీసుకుంటే ఆ టికెట్ పైన నాకు బుధవారం ఉదయం 3 గంటలు అని ఉంది. కాబట్టి అదే రోజు దర్శనం అవుతుంది అని చెప్పలేము. 

దర్శనం స్లాట్ కన్నా ఎన్ని గంటల ముందు లైన్ లోకి పంపిస్తారు ?

నేను పైన చెప్పినట్టు 3am దర్శనం ఉంటె , నేను మంగళవారం రాత్రి 10 గంటలకు లైన్ లోకి వెళ్దాం అనుకున్నాను అక్కడున్న అధికారులు నీ టైం 3 గంటలకు ఉంది 12 తరువాత పంపిస్తాము అన్నారు. రద్దీని బట్టి మారుతుంటుంది కాబట్టి మీరు లైన్ దగ్గరకు వెళ్తేనే తెలుస్తుంది. 

టికెట్స్ కోసం ఏమి తెచ్చుకోవాలి ? అందరూ లైన్ లో నిలబడాలా ?

మనం ఆధార్ కార్డు చూపించాలి , ఇవి ఉచిత దర్శనం టికెట్స్ కాబట్టి డబ్బులు అవసరం లేదు, ఎవరికీ వారు ఆధార్ కార్డు పట్టుకుని నిలబడాలి 

ఇద్దరివీ వేరువేరు టైం స్లాట్ లు ఉన్నాయి కలిసి వెళ్లనిస్తారా ?

వెళ్ళవచ్చు కాకపోతే టైం లు మరీ దూరంగా ఉండకూడదు , మీరు మీ టైం కన్నా ముందు వెళ్ళకూడదు కానీ ఆలస్యంగా వెళ్ళవచ్చు . అయినా ఒకసారి పైన అడగండి రద్దీ లేకపోతే పంపిస్తారు . 

అలిపిరి మెట్ల మార్గం సమయాలు చెప్పండి ?

అలిపిరి ఉదయం 3 am - రాత్రి 10 గంటల వరకు ఓపెన్ లోనే ఉంటుంది. 

శ్రీవారి మెట్ల మార్గం సమయాలు ?

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 

మెట్ల మార్గం లో లగ్గేజి పెట్టడానికి ఏమైనా ఉంటాయా ? బ్యాగ్ లను మోసుకునే వెళ్లాలా ?

అలిపిరి దగ్గర మరియు శ్రీవారి మెట్ల మార్గం దగ్గర దేవస్థానం లగ్గేజి కౌంటర్ లు ఉన్నాయి . మీరు మీ బ్యాగ్ లను ఇస్తే కొండపైకి తీసుకుని వస్తారు . ఇది ఉచిత సర్వీసు . 

శ్రీవారి మెట్ల మార్గం దగ్గర టిఫిన్ లు ఉంటాయా ?

లోకల్ వారు తెచ్చి అమ్ముతున్నారు , మెట్ల మార్గం మధ్య లో కాదు మెట్లు ఎక్కేముందే అమ్ముతున్నారు . 

శ్రీవారి మెట్ల మార్గం ఎలా వెళ్ళాలి ?

తిరుపతి రైల్ వే స్టేషన్ నుంచి దేవస్థానం వారివి ఉచితి బస్సు లు ఉంటాయి మరియు లోకల్ ఆటో లు కూడా ఉంటాయి . 

మీరు మెట్లమార్గం టికెట్ తీసుకున్నా  బస్సు లో కూడా తిరుమల వెళ్ళవచ్చు , మెట్లమార్గం లో టికెట్ తీసుకుంటే నడిచే వెళ్లాలనే రూల్ ఇప్పుడు లేదు 

ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే  8247325819 కు వాట్స్ యాప్ లో మెసేజ్ చేయండి

హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి . 

ఇవి చదివారా ?
తిరుమల టికెట్ లేకుండా వెళ్తున్నారా
తిరుమల లో రూమ్ కావాలా ?
300/- టికెట్స్ రూల్స్
500/- టికెట్స్ రూల్స్
శ్రీవాణి టికెట్స్ వివరాలు
లక్ష ఆపైన డొనేషన్ వివరాలు
సుప్రభాతం టికెట్స్
తోమాల సేవ టికెట్స్
అర్చన టికెట్స్
అష్టదళ టికెట్స్
కళ్యాణం టికెట్స్
తిరుప్పావడ టికెట్స్
మెల్చట్ వస్త్రం
చంటి పిల్లల దర్శనం
శ్రీవారి సేవ
నవనీత సేవ
పరకామణి సేవ
తిరుమల చుట్టుపక్కల ఆలయాలు
ఇతర ఆర్జిత సేవలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
తులాభారం
తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
సీనియర్ సిటిజెన్ దర్శనం
అరుణాచలం యాత్ర
కాశీయాత్ర

tirumala free darshan rules, tirumala ssd counters list, tirumala latest information. tirumala seva updates.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS