ఓం నమో వేంకటేశాయ , హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం ఇప్పుడు మనం తిరుమల 500/- దర్శనం టికెట్స్ గురించి తెలుసుకుందాం . తిరుమల దర్శనాలలో చాలా మందికి అర్ధం కానీ టికెట్ ఉందంటే అది 500/- దర్శనం టికెట్ గురించే . కరోనా కాలం లో వచ్చింది ఈ టికెట్ , స్వామి వారి సేవలను ఆన్ లైన్ లో చేసుకోవడానికి వీలు కల్పించమని టీటీడీ ఈఓ గారిని అడగడం తో ఆన్ లైన్ సేవ లకు శ్రీకారం చుట్టారు . ఆ రోజుల్లో ఆన్ లైన్ సేవ ల గురించి ఎవరికీ ఏ సందేహాలు రాలేదు కారణం తిరుమల వెళ్ళడానికి వీలు లేకపోవడం వలన , ఇప్పటికి ఆన్ లైన్ సేవ లు విడుదల చేస్తూ ఉండటం తో సందేహాలు చాలానే ఉన్నాయి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
500/- టికెట్ అంటే ఏమిటి ?
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆన్ లైన్ ఆర్జిత సేవలను ప్రవేశ పెట్టారు . సేవలకు 500/- గా టికెట్ ధర నిర్ణయించారు.
ఆర్జిత సేవల్లో ఏ సేవలు ఉంటాయి ?
ఇవి నాలుగు రకాల సేవ లు కళ్యాణం , ఊంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకర సేవ.
ఆన్ లైన్ సేవ కు దర్శనం ఉంటుందా ?
దర్శనం ఉంటుంది సేవ ఉండదు .
ఆన్ లైన్ సేవ వారికీ సుపథం నుంచి దర్శనం ఉంటుందా ?
ఉండదు , వీరికి 300/- దర్శనం టికెట్ ఇస్తారు .
ఆర్జిత కళ్యాణ సేవకు ఆన్ లైన్ కళ్యాణ సేవ కు తేడా ఏమిటి ?
మీరు కళ్యాణం బుక్ చేసుకుంటే మీకు సుపథం నుంచి దర్శనమ్ ఇస్తారు , మీరు కళ్యాణం చూస్తారు దర్శనం ఇస్తారు . అదే ఆన్ లైన్ బుక్ చేసుకుంటే మీకు సుపథం దర్శనం ఉండదు కళ్యాణం చూడలేరు దర్శనం 300/- లైన్ లోకి వెళ్లి చేసుకోవాలి .
తిరుమల ఆన్ లైన్ సేవ బుక్ చేసుకున్నాము దర్శనం ఎలా ?
మీరు సేవ బుక్ చేసిన తరువాత దర్శనం కూడా బుక్ చేసుకోవాలి . దర్శనం బుక్ చెయ్యాలంటే మీరు బుకింగ్ హిస్టరీ లోకి వెళ్లి ఆన్ లైన్ సేవ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు బుక్ చేసిన సేవ టికెట్ కనిపిస్తుంది view పై క్లిక్ చేయండి ఈ టికెట్ లో క్రింద దర్శన్ అని ఉంటుంది దర్శనం పై క్లిక్ చేస్తే కేలండర్ ఓపెన్ అవుతుంది అప్పుడు దర్శనం బుక్ చేసుకోవాలి .
నాకు తెలియక సేవ టికెట్ బుక్ చేశాను ఇప్పుడు కేన్సిల్ చేయవచ్చా ?
టికెట్ ని మనం కేన్సిల్ చేయలేము . మీరు సేవ బుక్ చేసినప్పటి నుంచి ఒక సంవత్సరం లోపు ఎప్పుడైనా దర్శనం బుక్ చేసుకోవచ్చు .
నేను దర్శనం బుక్ చేశాను వెళ్ళడానికి కుదరడం లేదు
ఒకసారి మీరు దర్శనం బుక్ చేస్తే డేట్ మార్చడానికి అవకాశం ఉండదు , టికెట్ డబ్బులు వెనక్కి రావు.
ఆన్ లైన్ సేవ ఇద్దరికీ బుక్ చేసాము ఒకరికి కుదరడం లేదు సింగిల్ గా వెళ్లవచ్చా ? రాని వారికి బదులుగా ఇంకొకరిని తీసుకుని వెళ్లవచ్చా ?
మీరు సింగిల్ గా కూడా వెళ్ళవచ్చు , ఒకరికి బదులు ఇంకొకరిని తీసుకుని వెళ్ళడానికి లేదు.
ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటె 8247325819 కు మెసేజ్ చేయండి
హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
#tirumala , tirumala online seva doubts, tirumala seva information, hindu temples guide. tirumala online seva darshan rules
Nice information for Kashi Yatra
ReplyDelete