Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***సెప్టెంబర్ నెలకు-2022  శ్రీవారి సేవా ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్లు 27.06.2022 10:00 PAM బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. ***సెప్టెంబర్ నెలకు -2022 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా 27.06.2022 సాయంత్రం 04:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. ***సీనియర్ సిటిజన్లు /ఫిజికల్లీ ఛాలెంజ్ టికెట్ కోటా జూలై-2022 కోసం, 28-06-2022 10:00 AM లోపు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Puruhutika Devi Shakthi Peetham Pithapuram | Temple Timings Accommodation Phone Numbers


అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తిపీఠంగా శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం పీఠాపురంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నుండి 18 కి. మీ దూరంలో పిఠాపురం ఉంది. పురుహూతికాదేవి కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికాదేవి గుడి ఉంది. 
ఈ ప్రదేశంలో కుక్కుటేశ్వరస్వామి వారి లింగం కుక్కుటాకారంలో ఉంటుంది. కుక్కుటము అనగా కోడి.
ఈ ఆలయం ప్రాముఖ్యత:

ఇది సతీదేవీ పీఠిభాగం పడిన  ప్రదేశంగా చెబుతుంటారు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ శక్తీపీఠ క్షేత్రమునకు పాదగయ అని పేరు కలదు. గయసురుడు అనే రాక్షసుని పాదాలు పిఠాపురంలో ఉన్నందున ఆ ప్రదేశాన్ని పాదగయ అనీ,గయాసురుని శిరస్సు  ఉన్న ప్రదేశాన్ని విష్ణుగయ అనీ పేర్లు కలిగెను. శివుడు కోడిలా కూసి గయాసురిని మరణానికి సహాయపడుట వలన కుక్కుటేశ్వర స్వామిగా కొలువు తీరెను. ఇక్కడ జగన్మాత పార్వతీదేవి పురుహూతికా దేవిగా ఆవిర్భవించినట్లు పురాణగాథ. పిఠాపురంలో కుక్కుటేశ్వరస్వామి దక్షిణాభిముఖంగా ఉంటాడు. ఈ స్వామికి ఎదురుగా ఉత్తరాభిముఖంగా పురుహూతికాదేవి ఆలయం ఉంది. ఇక్కడ శివరాత్రి, దసరా, కార్తీకమాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.

రాజమండ్రి నుండి పిఠాపురం వరకు కొన్ని రైలు వెళతాయి, రైల్వేస్టేషన్ నుంచి పురుహూతికా దేవి గుడి 1.5 కి. మీ దూరం ఉంటుంది. సామర్లకోట నుంచి పిఠాపురం 10 కిమీ దూరం ఉంటుంది ఆటోలో బస్సు ల సౌకర్యం కలదు. 
ఇక్కడ చూడలిసిన ఆలయాలు:
కుక్కుటేశ్వరాలయం, ఈ ఆలయం లోనే దత్తాత్రేయుని స్వయం భూ విగ్రహం కలదు. షిరిడీసాయిమందిరం, కాలభైరవుడి ఆలయం, కుంతిమాధవస్వామి ఆలయం, సీతరాములవారి గుడి, నవగ్రహాలగుడి, కాశి అన్నపూర్ణ దేవి  ఇంకా ఎన్నో ఆలయాలు ఈ గుడి ప్రాంగణంలో ఉన్నాయి.ఈ ఆలయ దగ్గరలో  వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీ పాదవల్లభస్వామిదత్త క్షేత్రం కూడా ఇక్కడ ఉన్నాయి.
Puruhutika Devi Temple Timings:
Morning :5 am to 12 pm
Evening  :4 pm to 9 pm
Puruhutika Devi Temple Address:
Kukkuteswara Swamy Temple Address:
NH 214,
Pithapuram,
East Godavari,
Andhra Pradesh 533450,
phone: 08869 251445.

Puruhuthika Devi Temple Google Map:

Click Here.


Puruhutika shakti peetham temple is located in Pitapuram District of East Godavari State of Andhra Pradesh.
puruhutika devi temple information, puruhotikadevi temple information in telugu, padagaya ksethram information in telugu, kukkuteswaraswamy temple details, famous temples in pithapuram, puruhotikadevi temple pdf file, kukkuteswara swamy pdf file, history of puruhotika devi temple, history of kukkuteswara swamy temple,18sakthipeetas,shakthipeetas information in telugu.

Comments

 1. మీరు చెప్పినట్లు ఇది అష్టా దశ శక్తి పీఠాలలో ఒకటే కానీ, అమ్మవారి మూల విరాట్ మాత్రం కుక్కుటేశ్వర ఆలయం లో లేదు. అది పిఠాపురం పాత బస్ స్టాండ్ కు ప్రక్క నుండి సుమారు వంద మీటర్ల దూరంలో శిష్థి కరణాల వీధిలో వుంది. అమ్మవారి మూల విగ్రహం ఓక నూతిలో దొరికింది. అర్ధ రాత్రి వేళ ఆ వీధిలో శక్తి ప్రభావం నేను స్వయంగా అనుభవించాను. ఇక కుంతీ మాధవ స్వామి దేవాలయం పాద గయ లో లేదు. ఆ ఆలయం వేరుగా వుంటుంది. శైవ వైష్టవ వైరం ఈ క్షేత్రంలో స్పష్టం గా కనబడుతుంది. శివ రాత్రి ఊరేగింపు కుంతీ మాధవ స్వామి ఆలయం ముందు నుండి వెళుతుంది. ఆ సమయంలో కుంతీ మాధవ స్వామి ఆలయం పూర్తిగా మూసి వేస్తారు. ఊరేగింపు అనంతరం ప్రక్షాళన చేసి తిరిగి తెరుస్తారు. భక్తులకు నా మనవి. మీరు ఎప్పుడైనా పిఠాపురం వెళితే అమ్మ వారి మూల విరాట్ ను దర్శించు కోవాలని అనుకుంటే నేను చెప్పిన చోటుకి వెళ్ళండి. తేడా మీరే గమనిస్తారు
  Vsn Gollapalli

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పింది చాలా వరకు నిజమే అయితే కుక్కుటేశ్వర స్వామి రథోత్సవం రోజున మాధవ స్వామి గుడి మూసి వేయడం అన్నది నిజం కాదు ఎందుకంటే ఆ ప్రక్కన ఉన్న వీధిలోనే మేము నివాసం ఉంటాం

   Delete
 2. Nepal Muktinath Kashi Yatra
  +91-9198595775

  ReplyDelete
 3. For more details about the Puruhutika Ammavaru please visit official website @ https://padagaya.org/sri-puruhuthika-ammavaru/

  ReplyDelete

Post a Comment

Popular Posts