అనూరాధ నక్షత్రము గుణగణాలు
అనూరాధా నక్షత్రం అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రం. అధిదేవత సూర్యుడు. జంతువు జింక, రాశ్యధిపతి కుజుడు. ఈ నక్షతరంలో జన్మించిన వారు జలక్రీడల అందు ఆసక్తులై ఉంటారు.
నైతిక ధర్మం , పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవం కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితంలో స్థిరపడడానికి సమయం పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయం కావాలి.
ఆరంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలంలో నిరాటంకంగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగజీవితంలో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతంగా సాగి పోతారు. ప్రేమవివాహాలు చేసుకుంటారు.
గుర్తిపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రే యస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు.
కీలక సమయంలో బంధువర్గం నుండి నమ్మకద్రోహం ఎదురౌతుంది. తండ్రి పద్దతులు నచ్చవు. తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది. సహోదర సహోదరీ వర్గం బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు.
యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానం , దూరప్రాంత ఉద్యోగం , దూరప్రాంత విద్యా విధానం మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంత మంది ఉన్నా ఏకాంతంగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. సాహిత్య, కళారంగాలను వైరాగ్యం మిశ్రమం చేసి ప్రయోగాలు చేస్తారు. వైద్య విద్యలలో రాణిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.
ఎవరిపట్ల శాశ్వత అనుబంధం ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభం సంపాదించిన రంగంలో తిరిగి ప్రవేశించరు. నిలకడగా, నికరంగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యం అన్ని విధాలుగా బాగుంటుంది.
Related Posts:
> అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
Tags: అనూరాధ, అనురాధ నక్షత్రం, Anuradha Nakshatram Phalalu, Anuradha Nakshatram Telugu, Anuradha Nakshatram Gunaganas, Anuradha, Anuradha Nakshatram Qualites Telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment