రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు - Rohini Nakshatra Gunaganas | Astrology In Telugu

రోహిణి నక్షత్రము గుణగణాలు

రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్సిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు.

ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలయందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి.

వీరి శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. మాతృవర్గం మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు.

త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శ ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపణలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము.

వీరు హాస్యప్రియులు, కళా ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురుమహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది.

క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనేతన వారిని సుఖపెదతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

Related Posts:

అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

Tags: రోహిణి నక్షత్రం, Rohini Nakshatram Phalalu, Rohini Nakshatram, Rohini Nakshatram telugu, Rohini Nakshatram qualities, astrology in telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS