Drop Down Menus

అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు - Ashwini Nakshatra Gunaganas | Astrology In Telugu

అశ్విని నక్షత్రము గుణగణాలు

అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు.

అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆశక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆశక్తి కలిగి ఉంటారు.

వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు.

వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆశక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు.

నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు.

అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి.

ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.

Related Posts:

> అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

> రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

Tags: అశ్విని నక్షత్రం, Ashwini Nakshatra, Ashwini Nakshatram Telugu, Ashwini Star, Ashwini Nakshatram Qualities, Ashwini, Astrology in Telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.