Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

స్వాతి నక్షత్రంలో పుట్టినవారి గుణగణాలు - Swati Nakshatra Gunaganas | Astrology In Telugu

స్వాతి నక్షత్రం గుణగణాలు

స్వాతి నక్షత్రాధిపతి రాహువు. స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి. కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహుప్రభావంతో కల్పనా శక్తి శుక్రప్రభావంతో సౌందర్యారాధనా శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు.

స్వాతి నక్షత్రజాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతినక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు.

ఈ నక్షత్రజాతకులు చిన్న వయసులో దాదాపు 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా యుక్తవయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కష్ట కాలపరిమితి నక్షత్రపాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది.

బాల్యంలో విధ్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించ వచ్చు. యుక్తవయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్ధికంగా సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు కనుక, గోచార రీత్యా శని నాలుగు, అయిదు స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది.

బుధుడికి ఇది మిత్రరాశి కనుక, గోచార రీత్యా బుధుడు నవమ స్థానాధిపత్యం వహించి యోగకారకుడౌతాడు కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది. శుక్ర, రాహువుల ప్రభావం చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా, సాత్విక గుణం కారణంగా ఈ రాశి వారు కళారంగ ప్రవేశం చేస్తే సుస్థిరతను సాధించి రాణించే అవకాశాలు ఎక్కువ.

బాహ్యంగానూ, గుప్తంగానూ శత్రువులు ఉంటారు. బాహ్యాకర్షణ, అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు. మార్గదర్శకమైన నడవడి కలిగిఉంటారు. కళాత్మకమైన వస్తు సేకరణ చేస్తారు. ఈతరుల అసూయకు లోను ఔతారు. అకారణమైన నిందకు గురి ఔతారు. ఒక వైపు వాదనలు విని ఏక పక్ష నిర్ణయాలు తీకునే కారణంగా అనేకులను దూరం చేసుకుంటారు.

దాని వలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు. సరి అయిన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా అభివృద్ధి మాత్రం కుంటు పడదు. దాతృత్వం ప్రోత్సహిస్తారు కాని దానగుణం తక్కువ.

ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. జల కారకుడైన శుక్రుడి ప్రభావితం వీరికి విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది.

Related Posts:

అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

Tags: స్వాతి నక్షత్రం, Swathi Nakshatram, Astrology In telugu, Swati Nakshatra Telugu, Swati Nakshatra Qualites, Swathi, Nakshatras

Comments