ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారి గుణగణాలు - Uttarashadha Nakshatra Gunaganas | Astrology In Telugu

ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు

ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని.

ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి.

వీరు తక్కువఁగా మాట్లాడెదరు, అణకువ కలిఁగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుఁగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుండఁదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నచ్చుకొనెదరు. కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు.

ఒకా నొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి , బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు.

ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటందుకు సరి అయిన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది.

మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మంచిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది.

కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయంను చేస్తారు. తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వరు. ఆర్ధికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.

Related Posts:

అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

Tags: ఉత్తరాషాఢ నక్షత్రము, Uttarashada Nakshatra, Astrology In telugu, Uttarashada Nakshatram Telugu, Uttarashada Nakshatra Qualites, Uttarashada Nakshatra Character, Uttarashada Nakshatra Gunaganas

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS