పునర్వసు నక్షత్రము గుణాగణాలు
ఇది గురు గ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు, అధిదేవత అధితి, పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు.
అవసర సమయంలొ ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకితో కాల్చడము వంటి అలసట కలిగించె విద్యల అందు ఆసక్తి అధికము. అభిప్రాయాలు, మాటలు స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది.
సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పదిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడడంలోనే ఆశక్తి అధికం కనబరుస్తారు.
వివాహజీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చెసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదె పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది.
ఇవి ఈ నక్షత్రజాతకులకు సాధారాణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపదతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది.సమస్యలను పరిష్కరించ గలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది.
బాల్యము సుఖవంతముగా జరిగినా తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. నలభై నుండి ఏభై సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయట పడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది.
Related Posts:
> అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
Tags: పునర్వసు నక్షత్రము, Punarvasu Nakshatra In Telugu, Punarvasu Nakshatra, Punarvasu Nakshatram qualities, Punarvasu Star, Astrology in Telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment