భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు - Bharani Nakshatra Gunaganas | Astrology in Telugu

భరణి నక్షత్రము గుణగణాలు

భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ.

పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు.

రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించ లేరు.

వృద్ధాపయములో సుఖజీవనము చేయడనికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము.

కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. విరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది.ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు.

ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధరణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది.

Related Posts:

అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

Tags: భరణి నక్షత్రము, Bharani Nakshatra Characteristics, Bharani Nakshatra, Bharani Nakshatra telugu, Bharani Star, Bharani Nakshatra qualities

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS