కృత్తిక నక్షత్రము గుణగణాలు
కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సుర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు.
బాల్యములో మంచి పోషణ, పపెంపుదల ఉంటుంది. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గదుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నెర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు.
వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నం మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది.
వీరు అవమానాన్ని సహించ లేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. వీరికి మధుమెహవ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో అస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగుణము ఎక్కువ.
అపాత్రా దానము చేస్తారు. మద్యవర్తిత్వం బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసమస్యల నుండి బయటపడి సుఖజీవితము సాగిస్తారు.
ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి.
Related Posts:
> అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
Tags: కృత్తిక నక్షత్రము, Krittika Nakshatra In Telugu, Astrology In telugu, Krittika Nakshatram, Krittika Nakshatra Qualities, Krittika Star