జ్యేష్ట నక్షత్రము గుణగణాలు
జ్యేష్ట నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రం , అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యములు కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకోవడనికి ప్రయత్నిస్తారు.
ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడనికి ప్రయత్నిస్తారు.
ఇతరుల సహాయాని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం కలిగి ఉంటారు.ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు. మిత్రబెధం కలిగించి, తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు.
నమ్మిన స్నెహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు సౌందర్యంగానే కనిపిస్తాయి.
భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం వీరికి సుఖంను కలిగిఉస్తుంది. సంతానం నష్టం కావచ్చు. అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపం ఉండదు. అన్నమాట, ఇచ్చిన వాగ్ధానము నిలబెట్తుకో లేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు.
శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నెహం ఉండదు. సాంకేతిక రంగం లో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మిద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించ గలరు.
తగిన వయసులో సంపాదన మొదలౌతుంది. సంపాదించిన ధనంను భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రం లో గ్రపరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటయీ.
Realted Posts:
> అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
Tags: జ్యేష్టా నక్షత్రం, Jyeshta Nakshatra Gunaganas, Jyeshta Nakshatram, Jyeshta Nakshatra Qualites Telugu,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment