Drop Down Menus

Kanchipuram Kamakshi Amman Temple Information in Telugu | Temple Timings Rooms Route Map

Kanchipuram Kamakshi Amman Temple Information in telugu
F

Kanchipuram Temple History
కాంచీపురం సప్తమోక్ష క్షేత్రాలలో ఒకటి. మిగిలిన క్షేత్రాలు ఉత్తర భారత దేశం లో ఉండగా ఒక్క కాంచీపురం మాత్రమే దక్షిణ భారతదేశం లో ఉంది. కాంచీపురం లో వెలసిన కామాక్షి అమ్మవారు అష్ఠాదశ శక్తి పీఠాల్లో ఒకటి. శ్రీ ఆదిశంకరులు కామాక్షి అమ్మవారిని నిత్యం కొలిచేవారని చరిత్ర చెబుతుంది.
కాంచీపురం లో ఉన్న శివాలయాల్లో ఎక్కడ అమ్మవారు శివుని పక్కన కనిపించరు. కామాక్షి దేవాలయం లోనే అమ్మవారు కనిపిస్తారు. కాంచీపురం శక్తి పీఠంగానూ మరియు మోక్షపురిగానే కాకుండా పంచభూత లింగ క్షేత్రం మరియు 108 వైష్ణవ క్షేత్రాలల్లో నాలుగు 4 క్షేత్రాలు కాంచీపురం లోనే ఉన్నాయి. ఎత్తైన గోపురాలతో పురాతన దేవాలయాలు కలిగిన క్షేత్రాలు కాంచీపురం లో ఉన్నాయి. కంచి కామ కోటిపీఠం అమ్మవారి ఆలయానికి దగ్గర్లోనే కలదు.
తిరుపతి నుంచి కాంచీపురం 120 కిమీదూరం లో ఉంది. తిరుమల కొండపైనుంచి మరియు కొండ క్రింద నుంచి కాంచీపురం వెళ్ళడానికి బస్సు లు ఉన్నాయి. సుమారు 4 గంటల సమయం పడుతుంది. అమ్మవారి ఆలయానికి దగ్గర్లోనే బస్సు ఆగుతుంది. ఒకవేళ మీరు బస్సు దిగకపోతే బస్సు స్టాండ్ నుంచి కూడా అమ్మవారి ఆలయం దగ్గరే. దర్శనానికి ప్రత్యేక టికెట్స్ ఏమి ఉండవు. అమ్మవారి ఆలయం లో అయ్యప్ప స్వామి వారు ఉంటారు కానీ మనం గుర్తించలేము, అయ్యప్ప ను గుర్తుపట్టకపోవడం ఏమిటి అనేగా ఇక్కడ అయ్యప్ప అమ్మవారి ఆలయానికి క్షేత్ర పాలకుడు మామూలుగా దర్శనం ఇచ్చేటట్టు కాకుండా చేతిలో కొరడా పట్టుకుని కూర్చుంటాడు. అమ్మవారికి నిత్యం పూజలు చేస్తుంటారు ఇక్కడ అమ్మవారి దర్శనం మనకి చాల ప్రశాంతంగా ఎంత సేపు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనిపిస్తే అంత సేపు దర్శనం చేస్కోవచ్చు. లైన్ లో అంత సేపు ఉండనిస్తారా ? అనేగా మీ సందేహం.. నిజమే ఉండనివారు. మరీ ఎలా కావాల్సిన అంత సేపు దర్శనం చేస్కోవచ్చు అని చెప్పారు అని అడగబోతున్నారా ? ఎలా దర్శనం చేస్కోవాలి అంటే మనకు దర్శనం అయ్యాక ముందుకి వెళ్తాము కదా..
అమ్మవారి కి ఎదురుగా ఎత్తులో అంటే మన వెనకాల ఉత్సవ మూర్తి ఉంటుంది. మీరు దర్శనం అయ్యాక ముందుకి నడిచిన తరువాత ఒక నాలుగు మెట్లు ఎక్కి పైకి వెళ్తే .. పై నుంచి అమ్మవారి దర్శనం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎదురుగా  కామాక్షి అమ్మవారు.. కుడిచేతివైపు ఉత్సవ మూర్తి.. ఎడమవైపు బంగారు కామాక్షి అమ్మవారిని ఉంచిన చోటు ... తలపైకి ఎత్తి చూస్తే విమాన కామాక్షి అమ్మవారు కనిపిస్తారు.
మీరు అమ్మవారికి పూజలు చేయించాలి అనుకుంటే అక్కడున్న పూజారులని సంప్రదించాలి.మీరు పైనుంచి దర్శనం చేసుకుంటున్నారు కదా!.. ఇప్పుడు క్రిందకి వచ్చి నడుస్తుంటే అమ్మవారి ఆలయం వెనుకవైపుకి వస్తారు.. వెంటనే నడిచి వెళ్లిపోకండి అక్కడ కాశి అన్నపూర్ణాదేవి ఆలయం చిన్న సన్నది కనిపిస్తుంది. దర్శనం చేస్కుని ముందుకి కదలండి. మనకి శ్రీ ఆదిశంకర చార్యుల సన్నది కనిపిస్తుంది. గురువులకు నమస్కరించి బయటకు వెళ్ళకండి. మీకు కుడివైపు కాస్త ఎత్తులో ఆది శంకరుల జీవిత చరిత్రకు సంబందించిన చిత్రపటాలు ఉన్నాయి మీరే జాగ్రత్త గమనించి చూడాలి. 
కామాక్షి అమ్మవారి పేరులో "కా" అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి అని అర్ధం. కామాక్షి అంటే లక్ష్మిని సరస్వతి ని కనులుగా కలిగినది.  కాంచీపురం లో ఉన్న మిగిలిన ఆలయకోసం క్రింద లింక్ లు ఇవ్వబడినవి వీటిపైనా క్లిక్ చేస్తే మీరు చూడవచ్చు.  
ఇవి చదివారా ?
Shankari Devi Temple శంఖరి శక్తిపీఠం
Kamakshi Amman Temple కాంచీపురం కామాక్షి అమ్మవారు
Jwalamukhi Temple
Chamundeshwari Temple శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం
Jogulamba Devi శ్రీ జోగులాంబ శక్తి పీఠం
Bhramaramba Mallikarjuna Temple భ్రమరాంబదేవి శక్తిపీఠం
Mahalakshmi Temple శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం
Ekveera Temple శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం
Mahakaleswar Temple శ్రీ మహాకాళిదేవి శక్తిపీఠం
Kukkuteswara Swamy Temple శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం
Biraja Temple శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం
Bhimeswara Temple శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం
Kamakhya Temple శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం
Alopi Devi Mandir శ్రీ మాధవేశ్వరీ దేవీ శక్తీ పీఠం
Jwalamukhi Temple
Mangla Gauri Temple శ్రీ మంగళ గౌరీ మహాశక్తీ పీఠం
Vishalakshi Temple విశాలాక్షిదేవి శక్తిపీఠం
Sharada Peeth శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం
శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం
శ్రీ నైనాదేవి శక్తిపీఠం
శ్రీ కుమారి దేవి శక్తిపీఠం
శ్రీ భ్రామరి దేవి శక్తిపీఠం
jothirlingas జ్యోతిర్లింగాలు

kamaskhi amman temple inside pics
Click Here For

Kanchipuram temple information, Best Temples Information in Hindu Temple guide, Tamilnadu Temple Information, Kamashi Amma temple History, Hindu temples guide.com
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON