Tirumala Parakamani Seva Rules Darshan Details | తిరుమల పరకామణి సేవ రూల్స్ దర్శనాలు

 

tirumala parakamani seva rules

ఓం నమో వేంకటేశాయ .. హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. మీరు మన హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే క్రింద కనిపించే ఫోటో పై క్లిక్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్ పూర్తీ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

hindu temples guide app

మనం ఇప్పుడు తిరుమలలో పరకామణి సేవ గురించి తెలుసుకుందాం. 

1. పరకామణి సేవ అంటే ఏమిటి?

జ. పరకామణి సేవ అంటే భక్తులు శ్రీవారికి హుండీ లో వేసిన మొక్కుబడులు లెక్కించడము, మొక్కులు సెపరేట్ చేయడమూ మొదలైనవి.

2. పరకామణి సేవ ఎవరు చేయవచ్చు? 

జ. పరకామణి సేవ గవర్నమెంట్ ఉద్యోగస్థులు,  బ్యాంకు, ఇన్సూరెన్స్,  గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీ ఉద్యోగస్థులు కి మాత్రమే అవకాశం ఉంటుంది.

3. పరకామణి సేవ  స్త్రీలు కూడా చేయవచ్చా?

జ. పరకామణి సేవ పురుషులకు మాత్రమే. ఎందుచేతనంటే చాలా లోతుగా చెకింగ్ ఉంటుంది

 4. పరకామణి సేవ కి వయస్సు లిమిట్ ఏమైనా ఉందా ? 

జ. 25 సంవత్సరములు నిండి 65 సంవత్సరములు లోపు వారు మాత్రమే సేవ కి అర్హులు.

5. పరకామణి సేవ ఎన్ని రోజులు ఉంటుంది ?

జ.  పరకామణి సేవ 3 రోజులు సేవ  ( శుక్రవారం, శనివారం & ఆదివారం) మరియు 4 రోజులు సేవ ( సోమవారం నుండి గురువారం వరకు) ఉంటుంది. మనకి కావలసింది సెలెక్ట్ చేసుకోవచ్చు

6. పరకామణి సేవకులకు అకామడేషన్ ఇస్తారా ?

జ.  అకామడేషన్ మరియు లాకర్ సేవా సదన్ 2 లో ఇస్తారు.

7. పరకామణి సేవ రోజుకు ఎన్ని గంటలు చేయాలి ?

జ.  సేవ రెండు బ్యాచులు గా ఉంటుంది.

A batch ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 1 గంట నుండి  4 గంటల వరకు,  B batch ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు తిరిగి  సాయంత్రం 4 గంటలు నుండి 6 గంటల వరకు సేవ చేయవలసి ఉంటుంది.

8. పరకామణి సేవకులకు టెంపుల్ డ్యూటీ ఉంటుందా ?

జ.  టెంపుల్ డ్యూటీ ఉండదు. సేవలో ఒక రోజు క్రింద తిరుపతిలో కాయిన్స్ పరకామణి చేయవలసి ఉంటుంది. టిటిడి వారు సేవా సదన్ నుండి బస్సు లో తీసుకు వెళ్ళి తీసుకు వస్తారు. ఉదయం 6 - 6.30 కి గంటలకు బస్ బయలుదేరుతుంది . సాయంత్రము 5 గంటల కు తిరుపతి నుండి బయలుదేరుతుంది.

9. పరకామణి సేవకులకు దర్శనము ఎప్పుడు ఉంటుంది ?

జ.  దర్శనము సేవ ఆఖరి రోజు కాని ఒక రోజు ముందు కాని సుపథం ద్వారా వెళ్ళి  దర్శనము చేసుకోవచ్చు .

పరకామణి సేవ కు వెళ్ళు కొత్త వారికి కొన్ని ముఖ్య సూచనలు. 

1. పరకామణి సేవ 3 రోజులు ( శుక్రవారం, శనివారం & ఆదివారం) మరియు 4 రోజులు ( సోమవారం నుండి గురువారం వరకు) ఉంటుంది. 

2. సేవకు మనము ఒక రోజు ముందుగా మధ్యాహ్నము 2 గం లోపు రిపోర్ట్ చెయ్యాలి. 

3. రాత్రి 7 - 8 గం డ్యూటీ లిస్ట్ వస్తుంది. 

4. తెల్లని పంచ, కట్ బనియన్ కట్ డ్రాయర్ తో మాత్రమే లోపలికి అనుమతిస్తారు. డ్రాయర్ కు ఎటువంటి పోకెట్స్ ఉండకూడదు. 

5. మొలతాడు, జంధ్యము ఉండవచ్చు కాని దానికి ఎటువంటి పిన్నీసులు, దారాలు ఉండకూడదు. 

6. చేతికి ఉంగరాలు, వాచీలు, దారాలు, మెడలో గొలుసులు మొదలైనవి ఉండకూడదు. 

7. పంచని జాయింట్ చేయకూడదు. 

8. క్రింద కూర్చుండి పని చేయాలి. మోకాళ్లు నొప్పులు ఉన్నవారు, క్రింద కూర్చో లేని వారు సేవ చేయడం కష్టము. 

9. అవసారాన్ని బట్టి తిరుపతి కి ఒక రోజు కాయిన్స్ పరకామణి కి పంపుతారు. టి టి డి వారి బస్ లో తీసుకు వెళ్ళి తీసుకుని వస్తారు. 

10. అకామడేషన్ సేవాసదన్ 2 లో ఇస్తారు. టు టయిర్ బెడ్స్ ఉంటాయి. లాకర్ ఇస్తారు. 

11. రూల్ ప్రకారము స్వామివారి దర్శనము ఆఖరి రోజున ఇస్తారు. కాని ముందురోజు డ్యూటీ పూర్తి అయిన తరువాత రిక్వెస్ట్ చేసి స్కానింగ్ చేయించుకొని సుపధం ద్వారా  దర్శనము చేసుకోవచ్చు. 

12. లోపల సేవ సమయంలో ఎటువంటి తినుబండారాలు ( హుండీలో ఏలకులు, కిస్మిస్ మొదలయినవి) నోటిలో వేసుకోకూడదు. పొరపాటున నోట్లో వేసుకుంటే హాస్పిటల్ తీసుకువెళ్ళి ఎనీమా చేసి కాని వదలరు. మరియు వారిని బ్లాక్ చేస్తారు. 

13. టి టి డి ఉద్యోగస్తుల క్యాంటీన్ లో సబ్సిడీ రేట్ల కి భోజనము, టిఫిన్  లభించును. లేదంటే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం లో భోజనం చేయవచ్చు. 

అందుచేత పరకామణి సేవకు వెళ్లు వారు పైన పేర్కొన్న ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవలసినది.

హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి . 

ఇవి చదివారా ?
తిరుమల టికెట్ లేకుండా వెళ్తున్నారా
తిరుమల లో రూమ్ కావాలా ?
300/- టికెట్స్ రూల్స్
500/- టికెట్స్ రూల్స్
శ్రీవాణి టికెట్స్ వివరాలు
లక్ష ఆపైన డొనేషన్ వివరాలు
సుప్రభాతం టికెట్స్
తోమాల సేవ టికెట్స్
అర్చన టికెట్స్
అష్టదళ టికెట్స్
కళ్యాణం టికెట్స్
తిరుప్పావడ టికెట్స్
మెల్చట్ వస్త్రం
చంటి పిల్లల దర్శనం
శ్రీవారి సేవ
నవనీత సేవ
పరకామణి సేవ
తిరుమల చుట్టుపక్కల ఆలయాలు
ఇతర ఆర్జిత సేవలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
తులాభారం
తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
సీనియర్ సిటిజెన్ దర్శనం
అరుణాచలం యాత్ర
కాశీయాత్ర

tirumala parakamani seva rules, tirumala latest information. tirumala seva updates, hindu temples guide tirumala latest information. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS