తిరుమల లో ఉన్న తీర్ధాలు వాటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది భక్తులు హిందూ టెంపుల్స్ గైడ్ కు చేస్తున్న మెసేజ్ లలో మాకు కొండపైన తీర్ధ ముక్కోటి అని చేస్తారంట కదా ఏది ఎప్పుడు చేస్తున్నారో తెలియడం లేదు ముందుగా తెలిస్తే మేము ప్లాన్ చేసుకుంటాము, టీటీడీ వాళ్ళు ఏ తీర్థాలకు ఎప్పుడు ఓపెన్ చేస్తారు వాటి విశేషాలు చెప్పండి అని అడగడం వలన సమాచారాన్ని మీకు అందిస్తున్నాము.
వేంకటాచల మహాత్యం వర్ణించిన 11 పురాణాలలో 26 ముఖ్యతీర్థాలు కన్పిస్తాయి. అవి: 1) కుమారదార 2)కపిల 3) పాండవ 4)జరాహర 5) ఫల్గుని 6) జాబాలి 7) సనకసనందన 8)కాయరసాయన 9)పాపనాశన 10)దేవ 11)పద్మసరోవర 12)అస్థిసరోవర 13) తుంబ 14)ఆకాశగంగ 15)చక్ర 16)కటాహ 17)మన్వాది అష్టోత్తరశత (మను మొదలైన 108 తీర్థాల సమూహం) 18)రామకృష్ణ 19)శంఖ 20)కల్యా 21)శక్ర 22)విష్వక్సేన 23)పంచాయుధ 24)బ్రహ్మ 25)సప్తర్షి 26)వ్రతతీవర్తని – తీర్థాలు.
ప్రధానమైనవి 7 తీర్థములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థములు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరించిన యెడల సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరునని పురాణ వైశిష్ట్యం.
ఏ తీర్థ ముక్కోటి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి వాటిపైన క్లిక్ చేయండి అవి ఓపెన్ అవుతాయి .
>>శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
తీర్థశబ్దార్థం : తీర్థ శబ్దానికి మొదట ‘పుణ్య’ అని అర్థం తర్వాత అర్థం విస్తృతి చెంది, ‘పవిత్రమైన జలం’ అనే అర్థం వచ్చింది. అందుకే పుణ్య క్షేత్రాన్ని ‘తీర్థక్షేత్రం’ అంటారు.
వేంకటాచలం – అనేక తీర్థాలకు నిలయం కనుక ‘తీర్థాద్రి అని అంటారు. తీర్థమంటే – తరింపజేసేది అని వ్యుత్పత్తి. మహర్షులు సేవించిన జలం – తీర్థం.
తీర్థాలను 4 విధాలుగా వర్ణీకరించవచ్చు.
1. ధర్మ ఆసక్తినిపేంచేవి. 2. జ్ఞానాన్ని సిద్ధింపజేసేవి.
3. భక్తివైరాగ్యాలను కల్గించేవి. 4. మోక్షాన్ని కల్గించేవి.
మీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
tirumala teerdhalu , tirumala information, tirumala latest information tirumala guide, hindu temples guide tirumala.