Drop Down Menus

తిరుమల తోమాల సేవ టికెట్స్ | Tirumala Tomala Seva Tickets Booking Rules

tirumala tomala seva
తిరుమల లో స్వామి వారికే ఉదయాన్నే సేవ లు  సుప్రభాత సేవ , తోమాల , అర్చన . ఈ సేవలను మొదటి గడప దర్శనం సేవ లు అని పిలుస్తారు. ఎందుకంటే ఈ సేవ టికెట్స్ ఉన్నవారిని మొదటి గడప వరకు తీసుకుని వెళ్లి దర్శనం చేయిస్తారు. మనం ఇప్పుడు తోమాల సేవ అంటే ఏమిటి ? సేవ ఎలా జరుగుతుంది ? టికెట్ ధర ఎంత ? టికెట్స్ బుకింగ్ ఎలానో తెలుసుకుందాం

తోమాల సేవ అంటే ఏమిటి ?

తోమాల సేవ అంటే స్వామివారిని రకరకాల పుష్పమాలతో అలంకరించడం మోర మాల నుంచి పది అడుగులు ఉండే మాల వరకు స్వామివారిని పైనుంచి కింద వరకు అలంకరిస్తారు.

తోమాల సేవ టికెట్స్ ఎలా బుక్ చేయాలి ?

తోమాల సేవ డైరెక్ట్ బుకింగ్ ఆప్షన్ లేదండి. డైరెక్ట్ బుకింగ్ ఆప్షన్ 2050వ సంవత్సరం వరకు బుక్ అయిపోయినవి తోమాల సేవా టికెట్స్ కావాలంటే ఆన్లైన్ లక్కీ డిప్ మాత్రం బుక్ చేసుకోగలము అలాగే ఆఫ్లైన్లో కొండపైన లక్కీ డిప్ లో మాత్రమే బుక్ చేసుకోగలము.  తోమాల సేవ బుకింగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

తోమాల సేవకి మొదటి గడప దర్శనం ఉంటుందా ?

తోమాల సేవ మహా అద్భుతంగా ఉంటుందండి స్వామివారి ముందు అరగంటసేపు మనల్ని కూర్చోబెట్టి సేవ చేస్తారు తరువాత మొదటి గడప దర్శనం లభిస్తుంది.

తోమాల సేవ ఎప్పుడు జరుగుతుంది ?

తోమాల సేవ ప్రతి మంగళ బుధ గురువారాల్లో జరుగుతుంది మనం మూడు గంటలకి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది తెల్లవారుజామున సేవ నాలుగు నాలుగున్నరకు జరుగుతుంది 5:30 కల్లా కంప్లీట్ అవుతుంది

తోమాల సేవకి చిన్న పిల్లల్ని అనుమతిస్తారా ?

తోమాల సేవకి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ప్రస్తుతం అనుమతించడం లేదు

తోమాల సేవకి కుటుంబ సభ్యులు నలుగురు వెళ్లే అవకాశం ఉందా ?

తోమాల సేవకి ఒక ఐడి మీద ఇద్దరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలమండి వేరే ఇద్దరికీ వేయాలంటే వేరే మొబైల్ నుంచి వేయాలి

తోమాల సేవ అంటే ఎలా ఉంటుంది ?

తోమాల సేవ మహా అద్భుతంగా జరుగుతుందండి ముందుగా చిన్న భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేస్తారండి ఆ తర్వాత పెద్ద స్వామివారికి మూలవిరాట్ కి రకరకాల పూలతో అలంకరిస్తారు పూలమాలలతో అలంకరిస్తారు అద్భుతంగా ఉంటుందండి .  ఈ సేవ సుమారు 30 ని|| లు జరుగుతుంది. ఈ సేవ టికెట్ ఉన్నవారిని మొదటి గడప దగ్గర నుంచి వరసగా కుర్చోనిస్తారు. అంటే ఈ సేవ మీకు వస్తే 30 ని కదలకుండా స్వామి వారిని చూడవచ్చు.  ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టే చిన్నపిల్లలను అనుమతించడం లేదు.

తోమాల సేవకి లక్కి డిప్ ఎలా వెయ్యాలి ?

తోమాల సేవకి రెండు మార్గాల ద్వారా లక్కీ డిపిలో మనం పాల్గొనవచ్చు ఒకటి ఆన్లైన్లో మనం లక్డిప్ లో పాల్గొనవచ్చు ఆన్లైన్లో నెలకి సంబంధించిన అన్ని రోజులకి అన్ని సేవలకు బుక్ చేసుకుంటే మనకి ఏదో ఒక సేవ తగిలే అవకాశం ఉంది అలాగే కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద సోమ మంగళ బుధవారాల్లో తోమాల సేవకి లక్కీ డిపి వేయవచ్చు లక్కీ డిపి కొచ్చి రోజుకి 10 టికెట్స్ మాత్రమే ఉంటాయండి . కొండపైన CRO ఆఫీస్ దగ్గర లక్కీ డిప్ ప్రతి రోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. లిక్కి డిప్ రిజల్ట్స్ సాయంత్రం 6:30 కు వస్తాయి. 

తోమాల సేవ టికెట్ ఖరీదు ఎంత ?

తోమాల సేవ టికెట్ ఖరీదు 220 రూపాయలు

మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ నెంబర్ 8247325819 కు వాట్స్ యాప్ లో మెసేజ్ చేయండి. 

ఇవి చదివారా ?
తిరుమల టికెట్ లేకుండా వెళ్తున్నారా
తిరుమల లో రూమ్ కావాలా ?
300/- టికెట్స్ రూల్స్
500/- టికెట్స్ రూల్స్
శ్రీవాణి టికెట్స్ వివరాలు
లక్ష ఆపైన డొనేషన్ వివరాలు
సుప్రభాతం టికెట్స్
తోమాల సేవ టికెట్స్
అర్చన టికెట్స్
అష్టదళ టికెట్స్
కళ్యాణం టికెట్స్
తిరుప్పావడ టికెట్స్
మెల్చట్ వస్త్రం
చంటి పిల్లల దర్శనం
శ్రీవారి సేవ
నవనీత సేవ
పరకామణి సేవ
తిరుమల చుట్టుపక్కల ఆలయాలు
ఇతర ఆర్జిత సేవలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
తులాభారం
తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
సీనియర్ సిటిజెన్ దర్శనం
అరుణాచలం యాత్ర
కాశీయాత్ర

#tirumala #tirumalatomalasave

tirumala arjitha sevas information. tirumala arjitha seva tomala seva details. how to book tomala seva. tomala seva ticket cost? tirumala latest information. 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.