11.పాశురము
కుక్క అ వైక్కణంగళ్ పలక అన్దు శట్రార్ తి అలళియచ్చెను శెరుచ్చెయ్యుమ్ కుట్రమొర్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్ శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్ ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడు. శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.
భావము: ఓ గోపాలకుల తిలకమా! ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా! పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా ! ఓ వనమయూరమా! రమ్ము. నీ సఖులు, బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు మాత్రము చలించక, మాటాడక, ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు.
అనగా యింత ధ్వనియగుచున్ననూ ఉలకక, పలకక (ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా! మరి యీ సంశ్లేషాను భవానందమును నీ వొకతెవెకాక అందరును అనుభవించునట్లు చేయవలెకాన, మా గోష్ఠిలో కలిసి యీ వ్రతము పూర్తిగావించుము అనుచున్నారు.
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:
Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 11వ పాశురం