23.పాశురము
మారిమలై ముళఱ్ఱూల్ మన్నిక్కి డన్దుఱఙ్గమ్ శీరియ శిఙ్గరివిత్తుత్తీ విళిత్తు వేరిమయిర్ పొట్ల వెప్పాడుమ్ పేర్ న్దుదరి మూరి నిమిర్ న్దు ముళఙ్గప్పురపుట్టు పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్ కోయిల్ నిన్రిన్గునే ఫోన్దరుళి కోప్పుడైయ శీరియ శిఙ్ఞాపనత్తిరున్దు యామ్ వన్ద కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్
భావము: వర్షా కాలములో చలనము లేకుండ పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని, తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లును, పరిమళముగల తన జూలునిక్కబోడుచునట్లు అటునిటు దొర్లి, లేచి తన శరీరమును బాగుగ సాగదీసి, ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి, గుహనుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామీ!
నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి, మనోహరంగా అలంకరింపబడిన యీ దివ్య సింహాసనమును అలంకరించవలె! అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె! ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె!' అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది.
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:
Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 23వ పాశురం