28.పాశురము
క ఱవైగళ్ పిన్ శెన్రు క్కానమ్ శేర్ మణ్బోమ్, అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై యమ్ నాముడైయోమ్ కు తైవాన్రు మిల్లాద గోవిన్ద ! ఉన్దన్నాడు ఉఱవేల్ నమక్కి జొళిక్క వొళియాదు. అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై చిఱు పేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే ఇతైవా నీ తారాయ్ పలైయేలో రెమ్బావాయ్.
భావము: ఓ కృష్ణా! మేము అవివేక శిఖామణులము, తెల్లవారగానే చద్దిత్యాగి పశువుల వెంట అడవికిపోయి, పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము వువేకమేమాత్రమును లేనివారము. అజ్ఞానులము. గొల్లపడుచులము . నీవు మా గొల్లకులంలో జన్మించటయే మాకు మహాభాగ్యము. నీతోడి సహవాసమే మాకదృష్టము. యీ బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచిలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణగుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోక మర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్నచిన్న పేర్లతో కృష్ణా!
గోవిందా! అని పిలిచాము. స్వామీ! అందుకు కోపగించుకోకు! జ్ఞానులు పొందవలసిన ఆ పద వాద్యమును యీ కారణమున మాకు యివ్వననబోకుము. నీతో మెలిగిన సుఖలమనే యెంచి మాపై కృపచేయుము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేయగ ఆశీర్వదించుమని, తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు.
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:
Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 28వ పాశురం
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment