Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tiruppavai Pashuram Day 26 in Telugu - Meaning | తిరుప్పావై ఇరవై ఆరవ రోజు పాశురం - పద్యం మరియు భావము

Thiruppavai 26 Pasuram Lyrics in Telugu

26.పాశురము

మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్ మేలైయార్ శెయ్ వనగళ్ వేణువన కేట్టియేల్ ఇలతై యెల్లామ్ నడుఙ్గ మురల్వన పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ- శన్నియమే పోల్వన శబ్దఙ్గళ్ పోయ్ ప్పాడుడై యనవే శాల ప్పెరుమ్ పలైయే, పల్లాణ్ణిశైప్పారే కోలవిళక్కే, కొడియే, విదామే ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.

భావము: ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరముకలవాడా! ఓ వటపత్రశాయీ! మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులున్నూ యీ స్నాన వ్రతాన్ని ఆచరించియున్నారు. ఈ వ్రతానికవసరమగు పరికరములను నిన్నర్ధింపగా వచ్చాము. దయచేసి ఆలకింపుము. భూమండలమంతయు వణుకు కల్గించునట్లు ద్వనించే పాలవంటి తెల్లనైన శఖంములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను. అతిపెద్దవైన పఱవంటి వాద్యములు కావలెను.

మృదుమధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి. వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి. వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకలన్నింటినీ నీ చిరుబొజ్జులో దాచుకుని, ఒక లేత మట్టి యాకుమీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామీ! కరుణించి మా వ్రతము సాంగోపాంగముగ పూర్తియగునట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపుము.

1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:

తిరుప్పావై 1వ పాశురం

తిరుప్పావై 2వ పాశురం

తిరుప్పావై 3వ పాశురం

తిరుప్పావై 4వ పాశురం

తిరుప్పావై 5వ పాశురం

తిరుప్పావై 6వ పాశురం

తిరుప్పావై 7వ పాశురం

తిరుప్పావై 8వ పాశురం

తిరుప్పావై 9వ పాశురం

తిరుప్పావై 10వ పాశురం

తిరుప్పావై 11వ పాశురం

తిరుప్పావై 12వ పాశురం

తిరుప్పావై 13వ పాశురం

తిరుప్పావై 14వ పాశురం

తిరుప్పావై 15వ పాశురం

తిరుప్పావై 16వ పాశురం

తిరుప్పావై 17వ పాశురం

తిరుప్పావై 18వ పాశురం

తిరుప్పావై 19వ పాశురం

తిరుప్పావై 20వ పాశురం

తిరుప్పావై 21వ పాశురం

తిరుప్పావై 22వ పాశురం

తిరుప్పావై 23వ పాశురం

తిరుప్పావై 24వ పాశురం

తిరుప్పావై 25వ పాశురం

తిరుప్పావై 26వ పాశురం

తిరుప్పావై 27వ పాశురం

తిరుప్పావై 28వ పాశురం

తిరుప్పావై 29వ పాశురం

తిరుప్పావై 30వ పాశురం

Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 26వ పాశురం

Comments