తిరుమల శ్రీవాణి ట్రస్ట్ పది వేల రూపాయల దర్శనం | Tirumala Srivani Trust Donation Information


Tirumala Srivani Trust Donation

ఓం నమో వేంకటేశాయ . హిందూ  టెంపుల్స్ గైడ్ కు స్వాగతం.  ఇప్పుడు మనం తిరుమల పది వేల రూపాయల దర్శనం అనగా శ్రీవాణి దర్శనం గురించి తెలుసుకుందాం. శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అంటే ఏమిటి దర్శనం ఎప్పుడు ఉంటుంది ? ఒక టికెట్ పై ఎంత మంది వెళ్ళవచ్చు అన్ని కూడా తెలుసుకుందాం .

శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏమిటి ?

SRIVANI అంటే శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ Sri Venkateswara Aalayala Nirmanam Trust . శ్రీవాణి ట్రస్ట్ కు మీరు డొనేషన్ ఇచ్చే వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆలయాలు నిర్మిస్తారు. 

ఆలయాల నిర్మాణం కొరకు డొనేషన్ ఇచ్చేవారిని ప్రోత్సహించడం కొరకు వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. 

శ్రీవాణి ట్రస్ట్ కు ఎంత డొనేషన్ కడితే బ్రేక్ దర్శనం ఇస్తారు ?

ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తారో వారికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. 

పది వేలు ఇస్తే భార్యాభర్తలు ఇద్దరు వెళ్లవచ్చా ?

ఒక 10 వేలుకు ఒక్కరికి మాత్రమే దర్శనం , ఇద్దరూ వెళ్లాలంటే 20 వేలు కట్టాలి .

పిల్లలకు కూడా 10 వేలు కట్టాలా ?

12 సంవత్సరాల లోపు వారిని టికెట్ లేకుండానే తీసుకుని వెళ్ళవచ్చు 

300/- దర్శనానికి దీనికి తేడా ఏమిటి ?

300/- దర్శనం లో మనం జయ విజయులు దగ్గర నుంచి దర్శనం చేసుకుంటాము. శ్రీవాణి దర్శనం లో మనం మొదటి గడప వరకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. 

దర్శనం తో పాటు ప్రసాదం ఇస్తారని విన్నాము నిజమేనా ?

శ్రీవాణి ట్రస్ట్ టికెట్ లో భక్తులను ఆలయ ధ్వజ స్థంభం దగ్గర నుంచి తీసుకుని వెళ్లి మొదటి గడప దర్శనం చేయించి ఆ సమయం లో స్వామి వారి దగ్గరున్న వాటిని ప్రసాదం గా ఇస్తున్నారు. 

టికెట్ తీసుకుంటే రూమ్ ఇస్తారా ?

సింగల్ గా బుక్ చేసుకుంటే రూమ్ ఇవ్వరు , రెండు టికెట్స్ బుక్ చేసుకుంటే ఇస్తారు . ఆన్ లైన్ లో చేసుకుంటే 90% రూమ్ దొరుకుంది . 

టికెట్ లు ఆన్ లైన్ లో కాకుండా ఇంకా ఎక్కడ ఇస్తారు ?

ఆన్ లైన్ లోనే కాకుండా కొండపైన గోకులం దగ్గర ఇస్తున్నారు 22 వ తేదీ నవంబర్ 2024 నుంచి 800 టికెట్స్   . ఎయిర్ పోర్ట్ లో 200 టికెట్స్ ఇస్తున్నారు . 

గోకులం దగ్గర టికెట్స్ తీసుకుంటే దర్శనం ఎప్పుడు ఉంటుంది ?

ఆన్ లైన్ లో తీసుకుంటే మీకు కావాల్సిన రోజుకి దర్శనం ఉంటుంది , గోకులం దగ్గర ఒక రోజు ముందు వచ్చి టికెట్ తీసుకోవాలి . 

ఏ సమయం నుంచి టికెట్స్ ఇస్తున్నారు ఎప్పటి వరకు ఉంటాయి ?

ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి టికెట్స్ ఇస్తారు . డైలీ 500 టికెట్స్ ఇక్కడ ఇస్తున్నారు టికెట్స్ అయిపోయేవరకు ఇస్తారు. 

కొండపైన టికెట్ తీసుకుంటే రూమ్ ఇస్తారా ?

రూమ్స్ ఖాళీలను బట్టి ఇస్తారు , ఖచ్చితంగా ఇస్తారని చెప్పలేము. 

శ్రీవాణి వారికి దర్శనం ఎప్పుడు ఉంటుంది ?

స్వామి వారి పూజలను బట్టి దర్శనం టైం మారుతూ ఉంటుంది. ఏది ఏమైనా 10am లోపు అవుతుంది. ఒక్కోరోజు 4am కు దర్శనం ఉంటుంది. 

ఆన్ లైన్ బుకింగ్ ప్రోసెస్ ఎలా ఉంటుంది ?

టీటీడీ వెబ్సైటు లేదా యాప్ లో మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు . శ్రీవాణి పై క్లిక్ చెయ్యాలి , అక్కడ మనకు దర్శనం అవైలబులిటీ మనం ముందుగా చూడవచ్చు , గుర్తు పెట్టుకోండి ఈ టికెట్ ధర మొత్తం 10500 అవుతుంది . ముందుగా మనం 10000 కట్టి ఆ తరువాత 500 పెట్టి బ్రేక్ దర్శనం బుక్ చేసుకోవాలి .

డొనేషన్ కట్టిన తరువాత మెనూ ఆప్షన్ లో డోనర్ ప్రివిలేజ్ అనే కొత్త ఆప్షన్ మీకు కనిపిస్తుంది . ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్రేక్ దర్శనం బుక్ చేసుకోవాలి ఆ సమయం లోనే రూమ్ కూడా చేసుకోవాలి. 

దర్శనాలకు తప్పకుండా సంప్రదాయ దుస్తులు ధరించాలి. 

ఇంకా ఏమైనా సందేహాలు ఉంటె 8247325819 కు వాట్స్ యాప్ లో మెసేజ్ చేయండి . 

హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి . 

ఇవి చదివారా ?
తిరుమల టికెట్ లేకుండా వెళ్తున్నారా
తిరుమల లో రూమ్ కావాలా ?
300/- టికెట్స్ రూల్స్
500/- టికెట్స్ రూల్స్
శ్రీవాణి టికెట్స్ వివరాలు
లక్ష ఆపైన డొనేషన్ వివరాలు
సుప్రభాతం టికెట్స్
తోమాల సేవ టికెట్స్
అర్చన టికెట్స్
అష్టదళ టికెట్స్
కళ్యాణం టికెట్స్
తిరుప్పావడ టికెట్స్
మెల్చట్ వస్త్రం
చంటి పిల్లల దర్శనం
శ్రీవారి సేవ
నవనీత సేవ
పరకామణి సేవ
తిరుమల చుట్టుపక్కల ఆలయాలు
ఇతర ఆర్జిత సేవలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
తులాభారం
తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
సీనియర్ సిటిజెన్ దర్శనం
అరుణాచలం యాత్ర
కాశీయాత్ర

#tirumala, tirumala srivani trust donation information, tirumala latest updates, tirumala seva information

2 Comments

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS