Tirumala Room Booking New Rules | తిరుమల రూమ్ బుకింగ్ రూల్స్

Tirumala Rooms information

తిరుమల వెళ్లే భక్తులు రూమ్స్ లేవండి ఎలా బుక్ చెయ్యాలి ? బుక్ చేద్దాం అనుకునే లోపే రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి పిల్లలతో వెళ్తున్నాం కాస్త వేరే మార్గం ఏదైనా ఉంటె చెప్పండి అని అడుగుతుంటారు. ఇప్పుడు రూమ్స్ కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం . 

హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తిరుమల గురించి ఎప్పటికప్పుడు మీకు పూర్తీ సమాచారం ఇస్తాము ఈ యాప్ పూర్తీ ఉచితం డౌన్లోడ్ చేసుకోవడానికి ఫోటో పై క్లిక్ చేయండి . 



తిరుమల తిరుపతి రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి? 

తిరుమలకి తిరుపతికి రూమ్స్ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నడు బుక్ చేసుకోవాలి. తిరుమల అంటే కొండపైన , తిరుపతి అంటే కొండ క్రింద అని అర్ధం. 

ఎన్ని నెలల ముందుగా రూమ్స్ విడుదల చేస్తారు ?

మూడు నెలల ముందుగా విడుదల చేస్తారు . 

ప్రతి నెల ఏ తేదీలలో విడుదల చేస్తారు ?

ప్రతి నెల ప్రస్తుతం 24 లేదా 25 న విడుదల చేస్తారు.

రూమ్ బుక్ చేసుకోవడానికి రూల్స్ ఏమైనా ఉంటాయా ?

ఇంతకూ ముందు దర్శనం టికెట్ ఉన్న లేకున్నా రూమ్ బుక్ అయ్యేవి ఇప్పుడు అవ్వడం లేదు. 

దర్శనం టికెట్ ఉంటే ఎన్ని రోజులు బుక్ చేసుకోవచ్చు ?

కొత్త రూల్స్ ప్రకారం మీరు 20వ తేదీన దర్శనం టికెట్ బుక్ చేస్తే మీకు రూమ్ బుకింగ్ సమయం లో టీటీడీ వారు 19,20వ తేదీలు మాత్రమే చూపిస్తారు. మిగిలిన తేదీలు మీరు బుక్ చేయలేరు. 

మాతో పాటు పెద్దవాళ్లు వస్తున్నారు వారు ఎక్కువ దూరం నడవలేరు ఆలయానికి దగ్గరగా రూమ్ కావాలి ఇస్తారా ?

ఆన్ లైన్ లో రూమ్ బుక్ చేసే సమయం లో కొండపైన  మనకు రూమ్స్ పేర్లు ఉండవు , కేవలం రూమ్ రెంట్ మాత్రమే కనిపిస్తుంది . కావున మనకు రూమ్ ఎక్కడ వస్తుందో చెప్పలేము. 

ఒక రూమ్ లో ఎంత మంది ఉండవచ్చు ?

రూమ్ బుక్ చేసే సమయం లో ఇద్దరి ఆధార్ కార్డు ల వివరాలు మనం ఇవ్వాలి, రూమ్ లో నాలుగురున్న టీటీడీ వారు అడగరు . 

మేము 10 మంది వెళ్తున్నాము మాకు రెండు లేదా మూడు రూమ్స్ కావాలి బుక్ చేస్తే ఒకేచోట వస్తాయా ?

ఒకేచోట వస్తాయని చెప్పలేము , ఆ సమయానికి ఖాళీ అయినా రూమ్ ఇస్తారు . 

రూమ్ బుక్ అయిన తరువాత ఏమి చెయ్యాలి నేను మొదటి సరిగా తిరుమల వెళ్తున్నాను నాకు ఏమి తెలియదు 

మీరు రూమ్ బుక్ అయిన ప్రింట్ తీసుకోండి , కొండపైన cro ఆఫీస్ దగ్గరకు వెళ్ళండి అక్కడ ARP కౌంటర్ ఉంటుంది అక్కడ మీరు మీ ప్రింట్ అవుట్ ని  స్కాన్ చేయ్యాలి ఒక్కోసారి వెంటనే మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో స్క్రీన్ పైన కనిపిస్తుంది , ఒక్కోసారి వెయిట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది . రద్దీని బట్టి 30 ని లోపే మీకు మీ మొబైల్ కు రూమ్ ఎక్కడ వచ్చిందో మెసేజ్ వస్తుంది . ఆ మెసేజ్ చూసుకుని మీరు ఆ ప్లేస్ కి వెళ్ళాలి . మీకు అడ్రస్ తెలియకపోతే అక్కడి అధికారులను అడగండి , టాక్సీ వాళ్ళు ఉంటారు వారు తీసుకుని వెళ్తారు వారికి డబ్బులు ఇవ్వాలి . 

రూమ్ బుక్ చేశాము ఇప్పుడు వెళ్లడం లేదు క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగి వస్తాయా ?

మీరు రూమ్ క్యాన్సిల్ చేయవచ్చు 36 గంటల లోపు మీరు క్యాన్సిల్ చేస్తే పూర్తీ అమౌంట్ మీ అకౌంట్ కి వస్తుంది. 

మేము ఆన్ లైన్ లో రూమ్ బుక్ చేయలేదు కొండపైన రూమ్స్ దొరుకుతాయా?

కొండపైన సి ఆర్ వో ఆఫీస్ వద్ద రూమ్స్ దొరుకుతాయి

కొండపైన రూమ్స్ ఏ ధరల్లో ఏ ధరలలో లభిస్తాయి?

కొండపైన రూమ్స్ 50 రూపాయలు 100 రూపాయలు వెయ్యి రూపాయలు రూమ్స్ లభిస్తాయి

రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు మనం డిపాజిట్ కింద అమౌంట్ కట్టాలా?

రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు రూమ్స్ ని బట్టి డిపాజిట్ కూడా కట్టాల్సి ఉంటుందండి , సాధారణంగా మనం 500 కట్టించుకుంటారు. 

కొండపైన రూమ్స్ ఎప్పటి నుంచి ఇస్తారు ?

cro ఆఫీస్ వద్ద ఉదయం 6 గంటల నుంచి రూమ్స్ ఇస్తారు, సాధారణంగా సాయంత్రం 6 గంటలకు వెళ్లినా రద్దీలేని రోజుల్లో రూమ్ దొరుకుతుంది 

రూమ్ కోసం లైన్ లో ఎక్కువ సేపు నిలబడాలా ?

సాధారణంగా 30 ని పైనే నిలబడాలి, ఇప్పుడు కొత్తగా ఎక్కువ సేపు లైన్ లో ఉంచకుండా మనకు టోకెన్ ఇస్తున్నారు. ఆ టోకెన్ పైన నెంబర్ ఉంటుంది బయట ఏ నెంబర్ వరకు రూమ్స్ ఇచ్చారు అనేది కనిపిస్తుంది, మీ నెంబర్ ఇంకా ఎంత దూరం లో ఉందొ మీకు తెలుస్తుంది. 

మేము స్లిప్ తీసుకుని వెళ్లిపోవచ్చా ? ఆఫీస్ దగ్గరే ఉండాలా ?

మీరు వెళ్ళవచ్చు , మీకు రూమ్ బుక్ అయినట్టుగా మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో రూమ్ ఎక్కడ వచ్చిందో తెలుస్తుంది ఆ ప్లేస్ కి మీరు వెళ్తే సరిపోతుంది. అక్కడ ఈ మెసేజ్ చూపిస్తే రూమ్ ఇస్తారు. గమనిక  ఒక్కోసారి మెసేజ్ రావడం ఆలస్యం అవుతుంది, మీకు డౌట్ గా ఉంటే cro ఆఫీస్ దగ్గర నెంబర్ బోర్డు చూడవచ్చు. 

మాకు మెసేజ్ వచ్చినా మేము లేట్ గా వెళ్తే రూమ్ ఇస్తారా ?

మెసేజ్ వచ్చిన రెండు గంటల్లో రూమ్ తీసుకోకపోతే రూమ్ ఇవ్వరు. 

మఠాలలో రూమ్ ఇస్తారా ? ఫోన్ నెంబర్ లు ఇవ్వండి 

మఠాలలో రూమ్ లకు ఆన్ లైన్ బుకింగ్ ఉండదు, బయట వారికి ఇచ్చేవి బాగా తక్కువగా ఉంటాయి. మీరు డైరెక్ట్ గా వెళ్లి అడిగితే అప్పటికి ఖాళీ ఉంటె వెంటనే ఇస్తారు. ఫోన్ చేసి బుక్ చేసుకోవడం ఉండదు

తిరుపతిలో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి?

తిరుపతిలో విష్ణు నివాసం గోవిందరాజు స్వామి సత్రాలలో ఆఫ్ లైన్ రూమ్స్ ఇస్తారు , ఆన్ లైన్ లో శ్రీనివాసం , మాధవం లో కూడా బుక్ చేసుకోవచ్చు . 

రూములో రెండో రోజుకి ఎక్స్టెన్షన్ ఇస్తారా?

ఖాళీ సందర్భాల్లో ఎక్స్టెన్షన్ ఉంటే ఇస్తారండి ప్రత్యేక దినాల్లో ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి కుదరదు

రూమ్స్ రిఫండ్ రావడానికి ఎంత సమయం పడుతుంది?

రూమ్స్ మీరు ఖాళీ చేశాక రూమ్స్ రిఫండ్ రావడానికి1- 10 వర్కింగ్ డేస్ పడుతుంది. 

మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి 

హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాము . మీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి . 

ఇవి చదివారా ?
తిరుమల టికెట్ లేకుండా వెళ్తున్నారా
తిరుమల లో రూమ్ కావాలా ?
300/- టికెట్స్ రూల్స్
500/- టికెట్స్ రూల్స్
శ్రీవాణి టికెట్స్ వివరాలు
లక్ష ఆపైన డొనేషన్ వివరాలు
సుప్రభాతం టికెట్స్
తోమాల సేవ టికెట్స్
అర్చన టికెట్స్
అష్టదళ టికెట్స్
కళ్యాణం టికెట్స్
తిరుప్పావడ టికెట్స్
మెల్చట్ వస్త్రం
చంటి పిల్లల దర్శనం
శ్రీవారి సేవ
నవనీత సేవ
పరకామణి సేవ
తిరుమల చుట్టుపక్కల ఆలయాలు
ఇతర ఆర్జిత సేవలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
తులాభారం
తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
సీనియర్ సిటిజెన్ దర్శనం
అరుణాచలం యాత్ర
కాశీయాత్ర

tirumala latest information tirumala melchat vastram complete details tirumala information in telugu. tirumala seva information. 

9 Comments

  1. ప్రస్తుతం గోవిందరాజుల సత్రంలో ఫ్రీ రూమ్స్ ఇస్తున్నారా తెలియజేయగలరు తెలియజేయగలరు

    ReplyDelete
  2. Tirupati lo room kavali one night ki, ela, low cost lo

    ReplyDelete
  3. Thanks for the detailed information
    Physically challenged wheel chair variki online lo dorakapothe offlinelo darshan ela andi

    ReplyDelete
  4. Swami puskarini lo snananiki tickets ela book cheyali

    ReplyDelete
  5. Annavaram devastanam lo room ala book chasukovale direct link vunte chappande🙏

    ReplyDelete
  6. Sir maku angapradakshana june 1 ki undi, may 31 ki room online bookings lo chupistunda.

    ReplyDelete
    Replies
    1. Room cancel sesukuni ..1st book sesukovali

      Delete
  7. Padamathi guest house daggaraki velthe rooms istara

    ReplyDelete
  8. Vishnu nivaasam lo offiline rooms yeppudu estaru?

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS