మేము కల్యాణానికి వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు టికెట్స్ ఉంటాయా ?
కల్యాణోత్సవ టికెట్స్ 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి
ప్రతి నెల ఎప్పుడు విడుదల చేస్తారు ?
ప్రతినెల సుమారుగా 21/22 తేదీలలో విడుదల చేస్తారు
కళ్యాణం టికెట్ ధర ఎంత ఉంటుంది ఎంత మంది వెళ్ళవచ్చు ?
టికెట్ ధర 1000/- భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళవచ్చు.
మాకు పిల్లలు ఉన్నారు వారిని తీసుకుని వెళ్లవచ్చా ?
12 సంవత్సరాల లోపు వారిని మీరు టికెట్ లేకుండా తీసుకుని వెళ్ళవచ్చు .
మాకు ఇద్దరు పిల్లలు పాపా , బాబు వయస్సు 12 కంటే ఎక్కువే ఏమి చేయమంటారు ?
వారి ఇద్దరికీ ఒక టికెట్ తీసుకుని వెళ్ళండి
నేను మా పిల్లలకు టికెట్ తీసేలోపే టికెట్స్ అయిపోయాయి వేరే మార్గం ఏదైనా ఉందా ?
టీటీడీ వారు ఆడపిల్లలకు సుపథం దగ్గరే 300/- టికెట్ ఇచ్చి పంపిస్తున్నారు . అబ్బాయిలకు ఇవ్వడం లేదు గమనించగలరు.
కళ్యాణం బుక్ చేసాము ఏమేమి తీసుకుని వెళ్ళాలి ఎక్కడకు వెళ్ళాలి ?
కళ్యాణం బుక్ అయిన ప్రింట్ అవుట్ మరియు మీ ఆధార్ కార్డు లు ఉండాలి. ముఖ్యంగా సాంప్రదాయ దుస్తులు ఉండాలి. మీరు స్వామి వారి ఆలయం పక్కన ఉన్న సుపథం (ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ) దగ్గరకు 10 గంటల లోపు వెళ్ళండి.
కళ్యాణం చేయించుకునే భక్తులకు దర్శనం ఉంటుందా ?
దర్శనం ఉంటుంది
దర్శనం అయి బయటకు రావడానికి ఎంత సమయం పడుతుంది ?
మీరు సుపథం లో రిపోర్ట్ చేసిన తరువాత ఆలయం లోపల ఉన్న మండపం లో కళ్యాణం చేస్తారు , కళ్యాణికి ముందు లేదా వెనక దర్శనం కూడా చేయిస్తారు. మీరు బయటకు రావడానికి 1pm అవుతుంది.
కళ్యాణం బుక్ చేసుకున్నాం మరల ఎన్ని రోజులకు సేవ బుక్ చేసుకోవచ్చు ?
ఆరు నెలల వరకు మీకు అవకాశం లేదు
మేము ఆరు నెలల వరకు దర్శనానికి రాకూడదా ?
మీరు ఆర్జిత సేవలను మాత్రమే బుక్ చేయలేరు 300/- దర్శనం తో పాటు ఇతర సేవ లు బుక్ చేసుకోవచ్చు.
కొండపైన లక్కీ డ్రా ఉంటుందంట కదా అక్కడ కూడా కళ్యాణం టికెట్స్ ఉంటాయా ?
కొండపైన CRO ఆఫీస్ దగ్గర లక్కీ డ్రా కౌంటర్ ఉంటుంది. అక్కడ ప్రతి రోజు మరుసటి రోజు జరిగే సేవలకు లక్కీ డ్రా ఉంటుంది మీరు అక్కడ కూడా డ్రా వేయవచ్చు.
కౌంటర్ టైమింగ్స్ చెప్పండి ?
9:30AM - 5:30 PM
కళ్యాణం వారికి మొదటి గడప దర్శనం ఉంటుందా ?
ఉండదు.
బుకింగ్ విధానం ఎలా ?
మీరు ముందుగా టీటీడీ దేవస్థానం వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
వెబ్ సైట్ : https://ttdevasthanams.ap.gov.in/
ఆర్జిత సేవలపై క్లిక్ చేయండి.
మీకు కావాల్సిన సేవ అనగా కళ్యాణం సెలెక్ట్ చేసుకోండి, క్రింద క్యాలెండర్ కనిపిస్తుంది గ్రీన్ లో ఉన్న తేదీలలో మీకు కావాల్సిన తేదీని సెలెక్ట్ చేసుకుని, టీటీడీ వారు అడిగిన మీ వివరాలు ఇవ్వండి అనగా పేరు , వయస్సు , ఆధార్ నెంబర్ ఇచ్చి next బటన్ పై క్లిక్ చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది.
హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి . వాట్స్ యాప్ నెంబర్ 7382679767
#TIRUMALA, TIRUMALA SEVAS, TIRUMALA KALYANAM TICKETS DOUBTS, TIRUMALA LATEST INFORMATION, TIRUMALA SAMACHARAM. TIRUMALA HINDU TEMPLES GUIDE.

కొత్తగా పెళ్లయిన వారికీ వెళ్ళటానికి అవకాశం ఉంటుందా
ReplyDeleteఒక ఐడి మీద ఎన్ని కళ్యాణం టికెట్లు చేసుకోవచ్చు ఆన్లైన్
ReplyDeleteKalyanam tickets wife and husban valle chesukovala, yeraina 2 chesukovacha
ReplyDeleteEvaraina oka gent oka lady vellochu.okavela okkare veldamanukunna kuda oka lady oka gent adhar petti book cheskovali. Tarvata kalyanam ki okkare vellina parvaledu
Delete