తిరుమల తిరుపతి దేవస్థానం వారు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఆ దర్శనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం .
తిరుమల తిరుపతి దేవస్థానం వారు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఆ దర్శనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం .
Tirumala Senior Citizen Darshan Rules Video
సీనియర్ సిటిజెన్ వయస్సు ఎంత ఉండాలి ?
చాల యూట్యూబ్ ఛానల్ లో 60 సంవత్సరాలని ప్రచారం చేస్తున్నారు అది నిజం కాదు. దేవస్థానం వారు ప్రత్యేక దర్శనానికి 65 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించారు.
దర్శనం ఏ సమయం లో ఉంటుంది ?
ప్రస్తుతం దర్శనం మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తున్నారు. 1:30 pm కు లైన్ లోకి వెళ్ళాలి .
దర్శనం టికెట్స్ కొండపైన ఇస్తున్నారా ?
దర్శనం టికెట్స్ ఇప్పుడు కొండపైన ఇవ్వడం లేదు. ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాలి .
ఎన్ని రోజులు ముందుగా బుక్ చేసుకోవాలి ?
మూడు నెలల ముందుగా బుక్ చేసుకోవాలి . ప్రతి నెల 22వ తేదీ లేదా 23న విడుదల చేస్తున్నారు. ప్రతి నెల ముందుగానే హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ లో తెలియచేస్తాము.
టికెట్ బుకింగ్ కు ఏమి కావాలి ?
మీ ఆధార్ కార్డు మరియు మీతో పాటు వచ్చేవారి ఆధార్ కార్డు ఉండాలి . మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
టికెట్ ధర ఎంత ?
ఇది ఉచిత దర్శనం. డబ్బులు అవసరం లేదు
సీనియర్ సిటిజెన్ తో పాటు ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లవచ్చా ?
ప్రస్తుత రూల్స్ ప్రకారం భార్య భర్తలకు మాత్రమే అవకాశం కల్పించారు. భార్య వయస్సు కనీసం 50 సంవత్సరాలు ఉండాలి . మ్యారేజ్ సర్టిఫికెట్ అడగడం లేదు కాబట్టి చాలామంది 50 దాటినా వారిని తోడుగా తీసుకుని వెళ్తున్నారు.
టికెట్ బుక్ చేసుకుని సమయం లో వరసగా రెండు రోజులు సీనియర్ సిటిజెన్ దర్శనం బుక్ చేసుకోవచ్చా ?
ఈ విధంగా బుక్ చేసుకుంటారనే ఉద్దేశ్యంతో టీటీడీ వారు 90 రోజులు వ్యవధి ఉండాలని నిబంధన పెట్టారు.
90 రోజులు గ్యాప్ బుకింగ్ చేసుకున్న తేదీ నుంచా లేదా దర్శనం నుంచా ?
మీరు దర్శనం చేసుకున్న తేదీ నుంచి 90 రోజులు వ్యవధి ఉండాలి.
సీనియర్ సిటిజెన్ దర్శనం చేసుకున్న రోజు కానీ లేదా మరుసటి రోజు కానీ వేరే దర్శనం చేసుకోవచ్చా ?
చేసుకోవచ్చు . మీరు సీనియర్ సిటిజెన్ కోట దర్శనం తప్ప మిగిలినవి అన్ని చేసుకోవచ్చు .
మీకు ఇంకా ఏదైనా అదనపు సమాచారం కావాలంటే 8247325819 కు మెసేజ్ చేయండి.
మీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
tirumala senior citizen darshan rules, tirumala darshan rules, tirumala updates, hindu temples guide
వికలాంగుల కోటాలో వెళ్లే వారికి తోడుగా భర్త లేదా భార్య కాకుండా వారి కొడుకునో కూతురినో తోడు తీసుకు వెలవొచ్చా చెప్పగలరు
ReplyDeleteజై గోవింద!రాజాగారు,మేము సీనియర్ సిటిజెన్స్ దర్శనం పొంది సంవత్సరం దాటింది.మా భార్య,భర్తల వయసు 77,67 సం.లు.మాకు ఒకరి సహాయం అవసరం.ఆన్లైన్లో ఎన్ని రోజుల ముందు చేసుకోవచ్చు.తెలపండి.
ReplyDeleteఓం నమో వెంకటేశాయ 500 రూపాయల టిక్కెట్స్ ఆఫ్ లైన్ లో ఇస్తారా , ఇస్తే ఎక్కడ ఇస్తారు
ReplyDeleteoffline lo ivvadam ledandi
Deleteహలో సార్ నేను సీనియర్ సిటిజన్ మరియు హ్యాండీక్యాప్డ్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు అనుకుంటున్నాను కొంచెం గైడ్ చేయగలరా
ReplyDeleteSenior citizen ki wheelchair assistance istara, customer care ani adigithe allow cheyamani chepparu, nadavaleni vari paristhithi enti. Senior citizen tho vere evarinaina thodu pampavaccha, konchem cheppandi
ReplyDelete