తుంబురుతీర్థ ముక్కోటి :
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ళ దూరములో వెలసివున్న ప్రముఖ పుణ్యతీర్థమగు శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం 2024 మార్చి 25న తారీఖున అత్యంత వైభవంగా తిరుమలలో జరుగనుంది.
పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నవని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి, ప్రధానమైనవి 7 తీర్థములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థములు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరించిన యెడల సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరునని పురాణ వైశిష్ట్యం.
పాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
ఏ తీర్థ ముక్కోటి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి వాటిపైన క్లిక్ చేయండి అవి ఓపెన్ అవుతాయి .
>>శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
మీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
tirumala tumbara teerdha mukkoti, hindu temples guide, temples guide telugu, temples guide telugu, hindu temples guide telugu.