Drop Down Menus

Sri Dhanwanthari Temple | Nelluvai | Kerala


శ్రీ ధన్వంతరి ఆలయం , నెల్లూవాయు  :

ఈ ధన్వంతరి ఆలయం నెల్లూవాయి గ్రామం , త్రిసూర్ జిల్లా కేరళ రాష్ట్రం లో కలదు. ఈ ఆలయం ఆయుర్వేదనికి మంచి సంబంధం ఉన్నది. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని అతి ప్రాచీన ఆలయంలలో ఒకటి. అత్యంత నిష్టతో స్వామివారికి పూజలు నిర్వహిస్తారు.

ఆలయ చరిత్ర  :

ఈ ఆలయంలో మొదట పరమశివునికి పూజలు జరిగేవి. అలా కొన్ని రోజుల తరువాత ధన్వంతరి మూర్తిని కూడా ప్రతిష్ట చేసి పూజలు ప్రారంభించారు. ఈ ఆలయానికి మారియొక్క ప్రత్యేకత ఆయుర్వేద ఆలయం అని పేరు కూడా ఉన్నది. ఈ ఆలయం 3500 సం || చరిత్ర కలిగీ ఉన్నది. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు. అందులో స్వామి వారికి ప్రసాదం అర్పించి అందరికీ పంచుతారు. ఈ ప్రసాదాని అత్యంత నిష్ట తో చేస్తారు. ఇందులో పసుపు , మీరియాలు , పెరుగు , ఉప్పు కలిపిన మిశ్రమని ప్రసాదంగా ఇస్తారు.


పూర్వం కేరళ ప్రాంతాని పరిపాలించే రాజు కొంత కాలం నుంచి  విపరీతమైన కడుపు నొప్పితో బాధపడతాడు. ఎంత మందిని సంప్రదించిన ఆ నొప్పి తగ్గడాన్నికి మార్గం చూపలేకపోయారు. రాజు చివరికి ఈ ఆలయంలో బ్రాహ్మణుల వంశానికి చెందిన నంబృధి లకి కబురు పంపాడు. కానీ భటులు వచ్చే సమయానికి ఇంటిలో ఒక స్రీ ఆమె కుమారుడు మాత్రమే ఉన్నారు. 

అప్పడు ఆ స్రీ 12 రోజుల పాటు పూజలు చేసిన తరువాత రాజు గారి వైద్యం చేయగలాడు అని చెప్పి ఆమె కుమారునికి వారి దైవం శివాలయం లో పూజలు చేస్తాడు. అప్పుడు శివుడు వృద్దా సన్యాసి రూపంలో వచ్చి 3 ఔషద గుళికలు ఇచ్చి ఇవి మీ రాజు చేత మింగించమని చెప్పి , ఆయన రోగం నయం అవుతుంది అని అప్పడు రాజు రోగం తగ్గగానే నువ్వు కోరుకున్న ధనరాశి ఇస్తాను అంటాడు. నీవు దానికి ఏం అంగీకరించకుండా రాజు నివసించే ప్రాంతంలో నదిలో  ధన్వంతరి విగ్రహం ఉంది. దాని తీసి పూజలు చేయమని చెప్పి అదృశ్యం అవుతాడు. 


ఆ బాలుడు 3 గుళికలు రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి సేవించమని చెపుతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన తగ్గని ఆ నొప్పి ఆ గుళికలు వేసుకున్న కొద్ది సేపటిలోనే తగ్గిపోతుంది. దానికి రాజు కృతజ్ఞతగా ధనరాశి ఇవ్వగా బాలుడు ధన్వంతరి విగ్రహం కావాలని రాజుకి చెపుతాడు. ఈ బాలుడు విగ్రహం తీసుకొని గుడిలో శివాలయం పక్కన ఉంచి పూజలు నిర్వహిస్తాడు. అందుకే ఈ ఆలయానికి ధన్వంతరి ఆలయం పేరు కూడా వచ్చింది. ఇప్పటికీ ఆ వంశంలోని వారే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు. అందుకే దేశం మొత్తంలో కేరళకి ఆయుర్వేదగా మంచి పేరు కూడా వచ్చింది. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 5.00-12.00
సాయంత్రం : 4.00-8.30

వసతి వివరాలు  :

ఈ ఆలయంలో వసతి సౌకర్యాలు తక్కువ. కానీ ఆలయం పక్కన ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

పాలక్కాడ్ నుంచి పట్టంబి చేరుకొని అక్కడి నుంచి నెల్లూవాయు కేవలం 10 కి. మీ దూరంలో కలదు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గర లోనే త్రిసూర్ రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి ఆలయానికి 25 కి. మీ దూరం కలదు.

విమానా మార్గం :

కొచ్చిన్ విమానశ్రయం లో దిగి కార్ లేదా బస్ లో ఈ ఆలయానికి చేరుకోవాలి. ఈ విమానాశ్రయం నుంచి ఆలయానికి 78 కి. మీ దూరం ఉన్నది.

ఆలయ చిరునామా :

Sri Dhanwanthari Temple
Nelluvai P.O., 
Erumapatty Via, 
Thrissur, 
Kerala – 680584


Keywords : Sri Dhanwanthari Temple , Nelluvai , Kerala , Lord Shiva , Dhanwanthari temple, Hindu Temples Guide 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.