Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

వరలక్ష్మి వ్రతంలో తోరం ఏ చేతికి కట్టుకోవాలి? ఎలా కట్టుకోవాలి? How To Tie toram For Varalakshmi Pooja

వరలక్ష్మి వ్రతంలో తోరం ఏ చేతికి  కట్టుకోవాలి?

వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాణ్ని ధరించే సంప్రదాయం గురించి తెలిసిందే ! ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు? ఏ చేయికి కట్టుకోవాలి  ?  ఎలా కట్టుకోవాలో తెలుసుకుందామా ?

అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ, సకల విజయాలూ కలగాలని కట్టుకునేదే తోరం. ఇలా తోరం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండుగకు దారితీసిందని నమ్మేవారూ ఉన్నారు.

వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తయిదువకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు, తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు... నవగ్రహాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ! 

ఈ నవసూత్రాన్ని తయారుచేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒకో పూవుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి.

ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథిపూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒకో ముడినీ అక్షతలతో కానీ, పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథిపూజ. ఇందుకోసం ఒకో ముడినీ పూజిస్తూ ఒకో మంత్రం చదవాలి.

👉 ఓం కమలాయై నమ: ప్రథమగ్రంథిం పూజయామి

👉 ఓం రమాయై నమ: ద్వితీయ గ్రంథిం పూజయామి

👉 ఓం లోకమాత్రే నమ: తృతీయ గ్రంథిం పూజయామి

👉 ఓం విశ్వజనన్యై నమ: చతుర్థ గ్రంథిం పూజయామి

👉 ఓం మహాల క్ష్మైనమ: పంచమ గ్రంథిం పూజయామి

👉 ఓం క్షీరాబ్దితనయామై నమ: షష్టి గ్రంథిం పూజయామి

👉 ఓం విశ్వసాక్షిణ్యై నమ: సప్తమ గ్రంథిం పూజయామి

👉 ఓం చంద్రోసహోదర్యై నమ: అష్టమ గ్రంథిం పూజయామి

👉 ఓం హరివల్లభాయై నమ: నవమ గ్రంథిం పూజయామి

ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత...!

‘బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం !

పుత్రపౌత్రాధివృద్ధించ మమసౌఖ్యం దేహిమే రమే’!!

అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి.

పై శ్లోకంలో దక్షిణేహస్తే అని స్పష్టంగా ఉంది. అంటే తోరాన్ని తప్పకుండా కుడిచేతికే ధరించాలన్నమాట.  అంతేకాదు,  చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు. కానీ తోరాన్ని కనీసం ఒకరాత్రి, ఒక పగలన్నా ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు. అలా ధరించే తోరం సంతానాన్నీ, సంపదను, సౌభాగ్యాన్నీ ప్రసాదిస్తుందని నమ్ముతారు.

వరలక్ష్మి  దేవి అనుగ్రహం మీ అందరి పైన   ఉండాలని ఆశిస్తూ...!

Famous Posts:

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

varalakshmi, lakshmi devi, vara lakshmi vratam, lakshmi devi vratam, varalakshmi vratam telugu, varalakshmi toram, varalakshmi pooja

Comments

Popular Posts