మెట్టు మార్గంలో తిరుమల వెళ్లే వారికి టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు ? | Tirumala Alipiri Srivari Mettu Tickets Information

తిరుమల మెట్ల మార్గం లో వెళ్లేవారు ముందుగా ఈ సమాచారం తెలుసుకోండి లేదంటే ఇబ్బంది పడతారు. మీరు అలిపిరి మెట్ల మార్గం లేదా శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్ళాలి అనుకుంటున్నారా ఈ సమాచారం మీకోసం . 

alirpi srivari mettu


అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారికి భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు. ఈ టికెట్స్ తెల్లవారుజామున 2 am నుంచి ఇచ్చేవారు ప్రస్తుతం అనగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాత్రి 9:30 నుంచే ఇస్తున్నారు.  . ఇవి దివ్య దర్శనం టోకెన్లు కావు , అనగా నడిచి  వెళ్లే వారికి ఇచ్చే స్పెషల్ దర్శనం టికెట్స్ కావు , మీరు ఈ టికెట్స్ తీసుకుని బస్సు లో కూడా వెళ్ళవచ్చు. ఈ టికెట్స్ సాధారణంగా 5 గంటల వరకు ఉంటున్నాయి. అలిపిరి మెట్ల మార్గం సమయాలు 4am - 10pm. మీ దగ్గర లగేజి  ఉంటే మెట్ల మార్గం దగ్గర క్రిందనే కౌంటర్ ఉంది మీరు అక్కడ లగేజి ఇస్తే పైకి దేవస్థానం వారు తీసుకుని వచ్చి చివర మెట్టు దగ్గర ఉన్న కౌంటర్ దగ్గర మీ లగేజి మీకు ఇస్తారు.

శ్రీవారి మెట్ల మార్గం లో వెళ్లేవారికి దివ్య దర్శనం టికెట్స్ ఇచ్చేవారు ప్రస్తుతం శ్రీవారి మెట్ల మార్గం లో వెళ్లేవారికీ కూడా సర్వదర్శనం టోకెన్ లే ఇస్తున్నారు  , అలిపిరి మెట్ల మార్గం లో మొత్తం మెట్లు 3550 ఉంటే శ్రీవారి మెట్టు మార్గం లో మెట్లు 2388 మెట్లు ఉన్నాయి. శ్రీవారి మెట్ల మార్గం లో ఉదయం 6 గంటల నుంచి టికెట్స్ ఇస్తున్నారు . టికెట్ తీసుకున్న వారు 1250 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలి. మీరు 4:30-5:30 మధ్యలో అక్కడకు చేరుకుంటే టికెట్స్ దొరుకుతాయి సాధారణంగా ఉదయం 7 గంటల వరకు టికెట్స్ ఉంటున్నాయి.  అలిపిరి మెట్ల మార్గం లో ఉన్నట్టే ఇక్కడ కూడా లగేజి కౌంటర్ ఉంది. క్రింద లగేజి ఇస్తే దేవస్థానం వారు కొండపైకి తీసుకుని వచ్చి చివరి మెట్టు దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్ లో మీ లగేజి ఇస్తారు. 

మీకు తిరుపతి లో ఇచ్చే దర్శనం టికెట్స్ దొరకకపోయినా లేదా మెట్లమార్గం లో టికెట్స్  కూడా లేకపోతే మీరు కొండపైన ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది మీరు డైరెక్ట్ గా వెళ్లి ఆ లైన్ లోకి దర్శనం చేసుకోవచ్చు . ప్రస్తుతం అన్ని చోట్ల సర్వదర్శనం టికెట్ లే ఇస్తున్నారు కాబట్టి మీరు టోకెన్ లు ఎక్కడ తీసుకున్న ఒకటే. 

keywords : alipiri steps, alipiri ticket counters list, alirpiri timings, alipiri srivari mettu information,

1 Comments

  1. Hi sir vishnu nivasam lo ticket tisukoni metla margam vellavacha

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS