అందరికి సేవ చెయ్యాలనే ఆలోచన ఉంటుంది. ఆచరణ కష్టమే... దానికి ఎన్నో కారణాలు. డబ్బు లేకపోవడం ఒక ప్రధాన కారణం ఐతే .. సమయం లేకపోవడం రెండవది. ఒక్కొక్కరివి ఒకో రకమైన భాద్యతలు.
ఇప్పుడు నాకో ఆలోచన వచ్చింది..
ఈ హిందూ టెంపుల్స్ గైడ్ వెబ్సైటు ప్రచారానికి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు గూగుల్ వాడికో లేదా పేస్ బుక్ వాడికో ఇవ్వాలి.. వాళ్ళకి ఇస్తే మన సైట్ కోసం అందరికి తెలిసేలా చేస్తారు. నా ఆలోచన ఏమిటంటే ఇంతకముందు టెంపుల్ క్విజ్ ఒకటి పెట్టి గెలిచినవారికి చాగంటి వారి ప్రవచనాలు డీవీడీ లు కొరియర్ చేశాను. 2500/- వరకు ఖర్చుపెట్టాను. ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది క్విజ్ లో విన్ అవుతే అన్ని రూపాయలు ఏదైనా వృద్ధాశ్రమానికి లేదా అనాదాశ్రమానికి ఇవ్వాలని ఆలోచన. ఒకసారి ప్రయత్నిస్తే పోయేది ఏమి లేదుకదా అనుకున్నట్టుగా విజయవంతం అవుతే ప్రతినెల కొనసాగించవచ్చు.
మీరు ఈ సేవ కార్యక్రమం లో పాల్గొనాలి అంటే ఈ క్విజ్ ఆడటమే ..
Click Here:
Click Here:
విన్ అయినతరువాత కామెంట్ చెయ్యడం మరువకండి ..
Comments
Post a Comment