Drop Down Menus

Srisailam Tour Packages Information | Srisailam Tour Details From Hydrabad

నల్లమల్ల కొండల్లో పరమశివుడు కొలువైయున్నాడు. జ్యోతిర్లింగ స్వరూపంగా భక్తులపాలిటి కొంగుబంగారం గా జ్ఞానప్రధాతగా శ్రీశైలం లో శివయ్య పూజలు అందుకొంటునాడు. ఎప్పడినుంచి జ్యోతిర్లింగా ఉన్నదో చెప్పడం కష్టం, స్వామి వారి దర్శనం చేస్కుంటున్నా సమయం లో భక్తులకు కలిగే మానసిక అనుభూతి వర్ణనలకు దొరికేది కాదు , ఎవరకు వారే ఆ అనుభూతిని పొందాల్సిందే. ఒక్కరు కాదు ఇద్దరూ కాదు ఎందరో పండిత పామరులనే భేదం లేదు, రాజు పేద అనే తేడా లేదు అందరు స్వామి నీవే దిక్కనుచు స్వామి వారి అంతరాలయం లో ప్రవేశించి వారి తలను స్వామి వారి లింగమునకు తాటిస్తూ ఓం నమః శివాయ .. ఓం నమః శివాయ అంటూ గట్టిగ ఒక రకమైన అలౌకిక స్థితిలో చేసే ఆ శివనామస్మరణ , స్వామి వారి దర్శనానికి లైన్ లో నిలబడి అంతరాలయం లో ప్రవేశించగానే స్వామి వారి నామస్మరణతో ఆలయం లోపల నుంచి వచ్చే తరంగాలు మన గుండెలను తాకగా వచ్చే  ఆధ్యాత్మిక , భక్తి పారవశ్యం తో మనకు తెలియకుండానే శివ నామస్మరణా చెయ్యడం అందరికి అనుభవమే. 
12 జ్యోతిర్లింగాల్లో తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏకైక జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం, స్వామి వారి తో పాటు భ్రమరాంబ అమ్మవారు వెలిసి ఉన్నారు ఈ అమ్మవారు అష్ఠాదశ శక్తిపీఠాల్లో ఒకటి , మనకి ఒకేసారి జ్యోతిర్లింగ , శక్తిపీఠాన్ని దర్శించే అరుదైన అవకాశం మనము శ్రీశైలం లో పొందగలం. 

జగద్గురువులు  శ్రీ ఆదిశంకరుల వారు శ్రీశైలం లో ఉండే శివానందలహరి రచించారు. ఆదిశంకరుల తపస్సు చేసిన ప్రదేశం, వారి పాద ముద్రికలు మనం చూడవచ్చు. త్రేతాయుగం లో శ్రీరాముడు , ద్వాపరయుగం లో పాండవులు ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శించారు,  ఎందరో రాజులు స్వామి వారి సేవలో తరించారు, వారిలో ప్రముఖులు శివాజీ . ఇక్కడ శివాజీ స్మారక నిర్మాణం కూడా ఉంది. 


నిజానికి శ్రీశైలం చూసిరావాలంటే ఒక్కరోజు సరిపోదు , చక్కగా ఒక రెండు రోజులైనా ఉంటే అన్ని దర్శించి రావచ్చు శ్రీశైలం లో మనం మిస్ కాకుండా చూడవలసిన వాటిల్లో పాతాళ గంగ, సాక్షి గణపతి ఆలయము, శ్రీశైల శిఖరం, పాలధార, పంచధారలు, ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం, శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము, హటకేశ్వరం, శిఖరం, కదళీవనము. 


Book My Darshan వారు  శ్రీశైలం టూర్ కి ఏర్పాట్లు చేశారు , ప్రతిరోజూ ఈ యాత్ర ఉంటుంది. ఈ యాత్ర 3 రోజులు ఉంటుంది.  మీరు యాత్ర వివరాలు కొరకు వారిని సంప్రదించండి 
Book My Darshan Contact Details :
Land Number :04023554455,
Cell Number : 918186000111
Click Here Website link : https://goo.gl/jJ7pVQ

keywords : Srisailam Tour, Tour Packages , Srisailam Temple History , Srisailam Tour Deails, Srisailam Tour and travels , Travels Information , Srisailam Flight , Hyderabad to Srisailam Distance , Hyderabad to srisailam tour Details and packages , How much cost to travel Srisailam to hyd , Srisailam Tour Special Packages, Andhra Pradesh Tours and Travels. 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.