Drop Down Menus

Lakshmi Ashtottara Shatanamavali | శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి | Stotras

లక్ష్మి  సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువు నకు ఇల్లాలు.భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీర సాగరమథన సమయంలో ఉద్భవించింది. జైనమతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టనష్టాలనుండి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుంది. మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. తమిళంలో తిరుమగళ్ అంటారు. ఆమె ఆరుసుగుణములు పరిపూర్ణముగా కలిగినది. నారాయణుని శక్తికి ఆమెయే కారణము. బెంగాల్‌లో దుర్గాపూజ సమయంలో లక్ష్మి, సరస్వతి, వినాయకుడు, కార్తికేయుడు వీరందరినీ దుర్గామాత బిడ్డలుగా ఆరాధిస్తారు. 


శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి

దేవ్యువాచ
దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర
కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక 
అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః

ఈశ్వర ఉవాచ
దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకమ్
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనమ్

సర్వదారిద్ర్యశమనం శ్రవణాద్భుక్తిముక్తిదమ్
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతమం పరమ్

దుర్లభం సర్వదేవానాం చతుఃషష్టికళాస్పదమ్ 
పద్మాదీనాం వరాంతానాం విధీనాం నిత్యదాయకమ్

సమస్తదేవసంసేవ్యమణిమాద్యష్టసిద్ధిదమ్
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్

తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాః శ్రృణు
అష్టోత్తరశతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవతా

క్లీంబీజపదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ
అంగన్యాసః కరన్యాస స ఇత్యాదిః ప్రకీర్తితః

ధ్యానమ్

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితామ్
భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిః సేవితాం
పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః 

సరసిజనయనే సరోజహస్తే ధవలతరాంశుకగంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్

ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదామ్
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్

వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్

అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్
నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవామ్

అనుగ్రహపదాం బుద్ధిమనఘాం హరివల్లభామ్
అశోకామమృతాం దీప్తాం లోకశోకవినాశినీమ్

నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్

పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్

పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభామ్
నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీమ్ 

చతుర్భుజాం చంద్రరూపామిందిరామిందుశీతలామ్
ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్

విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీమ్
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియమ్

భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్
వసుంధరాముదారాంగీం హరిణీం హేమమాలినీమ్

ధనధాన్యకరీం సిద్ధిం స్రైణసౌమ్యాం శుభప్రదామ్
నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదామ్

శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామ్'
నమామి మంగళాం దేవీం విష్ణువక్షఃస్థలస్థితామ్

విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితామ్
దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్

నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికామ్
త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీమ్

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం
త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః
క్షీరోదజే కమలకోమలగర్భగౌరి
లక్ష్మీః ప్రసీద సతతం నమతాం శరణ్యే

త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః
దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః

దేవీనామసహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్
యేన శ్రియమవాప్నోతి కోటిజన్మదరిద్రతః

భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సరమాత్రకమ్
అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే

దారిద్య్ర మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్
యేన శ్రియమవాప్నోతి కోటిజన్మదరిద్రితః

భుక్త్వా తు విపులాన్ భోగానస్యాః సాయుజ్యమాప్నుయాత్
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోపశాంతయే
పఠంస్తు చింతయేద్దేవీం సర్వాభరణభూషితామ్
Keywords : 
sri lakshmi  asthottara satanamavali , sri lakshmi asthottaram lyrics , lakshmi astotram lyrics in telugu, sri lakshmi shatanamavali, sri lakshmi astotram pdf , temples guide asthotram, stotras, astotras,
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.