ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 29th Question


29th Question :
ప్రశ్న ) "లోకాన్ని ఉద్దరించాలని బయలుదేరాం. చాలా దీక్షతో, పట్టుదలతో కృషిచేశాం. వేషాలు మార్చం, భాషలు మార్చం, తరహాలు మార్చం, బూడిదలో పన్నీరు పోసినటైంది. వ్యర్ధ ప్రయత్నంచేశామని విసుగుపడి అన్నీ పనులు మానేశాము." ఈ సంఘాన్ని మార్చలేం" అని అస్రన్యాసం చేశాం. సోమరితనం బాగా పెరిగి పోయింది. శరీరం, జీవితం, కాలం స్తంభించి పోయినాయా ? అనిపిస్తుంది ఏలా దీన్ని పరిష్కరించడం ? 

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ‖ (3వ అ - 8వ శ్లో)

జవాబు :  లోకంలో మనుషులు 1. అకర్ముములు 2. సకర్ములు 3. నిష్కమకర్ములు అని మూడు రకాలుగా ఉంటారు. ఇందులో మీరు ప్రస్తుతం మొదటి తెగలో చేరతారు. తమోగుణం ప్రధానంగా ఉండడం వల్ల అలా అస్రన్యాసంచేశారు. కనుకనే సోమరులైనారు. కొరికాలతో మంచిదో చెడ్డదో ఏదో ఒక పని చేస్తూ ఉంటే మీరు సకర్ములౌతారు. అప్పడు రజోగుణం మీలో ప్రధానమౌతుంది. ఇది నా కర్తవ్యమని కర్మలచరించలంటే సత్వగుణం మీలో పెరగలి. అప్పుడు మూడవ తెగలో చేరి నిష్కామ కర్మూలౌతారు. ఏ పనీ చేయకుండా ఉండే కంటే ఏదో ఒక పని చేయడం మంచిపని చేయడం శ్రేయస్కరం. ఏ పని చేయకపోతే మరి జీవితం, కాలం స్తంభించక తప్పదు. శరీరయాత్ర కూడా సమాజంలో గడపడం కష్టం. కనుక ఏదో ఒక పని చేయడం మంచిది.


తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 
bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

Comments