Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 34th Question


34th Question :
ప్రశ్న ) రాముడు, కృష్ణుడు దేవుళ్లంటారు కదా! భగవంతుడు కూడా సామాన్యమనవుడిలాగా గురుకులాల్లో చదవడం, భార్య కోసం బాధపడటం ఇలాంటి లౌకిక కర్మలనేందుకు చేస్తాడు? ఆయనకు మనవుడిలాగా కోరికలు, పుణ్యపాపాలు ఉండవు కదా! వారు మన మాదిరి మనవులైతే మనం వారిని పూజించడం ఎందుకు ? వారి కథలను పురాణాలలో చదవడంవల్ల మానవజాతికేం ప్రయోజనం కలుగుతుంది ? అంటాడు నా మిత్రుడు. ఏమిటి దీనికి సమాధానం ? 


న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ‖ (3వ అ - 22వ శ్లో)

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ‖ (3వ అ - 23వ శ్లో)


ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ‖ (3వ అ - 24వ శ్లో)


జవాబు : రాముడు, కృష్ణుడు శ్రీమహావిష్ణువుఅవతారాలు. భగవంతుడు నీకోరికతోను లౌకిక కర్మలను మనవుడిలాగా చేయలేదు. ఆయనకు ముల్లోకాల్లోనూ కర్తవ్యమంటూ ఏది లేదు. అలాగే ఆయన పొందంది కాని పొందవలసినది గాని ఏది లేదు. అయినా ఆయన కర్మలను ఆచరించాడు. మనుషులు అన్నీ విధాలా ఆయన ప్రవృత్తిని అనుసరిస్తున్నారు. కాబట్టి తన విధులల్లో ఏమరపాటు లేకుండా ఆయన కర్మలను సమష్టించాడు. అలా కాకపోతే " రాముడే ఇలా చేశాడు కృష్ణుడే ఇలా చేశాడు," అని మనుష్యులు కూడా అలాగే ప్రవర్తిస్తారు. భగవంతుడు కర్మల నాచారించకపోతే ఈ లోకాలన్నీ నాశనమైపోతాయి. అనేక రకాల సంకరాలు ఏర్పడతాయి. వాటితో ప్రజలు నాళాన్ని పొందుతారు. అందువల్ల వారు కర్మలను మానవులు చేసినట్లే చేశారు. వారు మానవజన్మను స్వీకరించినంత మాత్రన వారికి మనకు తేడా లేదను కోవడం పొరపాటు. కారణజన్ములుగా అవతారం స్వీకరించిన వాళ్ళు వాళ్లు. ప్రారబ్ధంతో పుట్టిన వాళ్లను మనం. వారి కథలను చదవడం వల్ల మనకు ఆత్మశక్తి, నైతికశక్తి పెరిగి జీవన విధానం. 

తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

Comments