Drop Down Menus

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి..? ఎలా చేయాలి? Significance of doing Pradakshina for Lord Hanuman

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి..? ఎలా చేయాలి?  

ఎన్ని ప్రదక్షిణలు చేయదులచుకున్నను, ప్రతి ప్రదక్షిణము తర్వాత ఒక చోట ఆగి ఈ శ్లోకం చెప్పకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను.

Also Readపాపాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం 30 రకాల శిక్షలు ఇవే 

ఏ దేవాలయానికి వెళ్ళినా 3 ప్రదక్షిణాలు చేస్తాం. 

కానీ హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 

'ప్రదక్షిణనమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్షవాక్యం.

మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. 

సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. 

ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి 

సంతానం పొందిన వారెందరో ఉన్నారు..

నియమాలు పాటించడం ముఖ్యం.

హనుమంతునకు ప్రదక్షిణములు అంటే ఇష్టం. ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షణలు చేసేటప్పుడు ప్రతీ ప్రదక్షిణ తరువాత ఆగి..చెప్పుకోవల్సిన శ్లోకము'...

ఆంజనేయం మహావీరం ! 

బ్రహ్మ విష్ణు శివాత్మకం ! 

అరుణార్కం ప్రభుం శమథం ! 

రామదూతం నమామ్యహం !'

హనుమంతునకు ప్రదక్షిణములు రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 

27 ప్రదక్షిణములు చేయాలి. 

పుష్పములు, వక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది.

ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం..

‘‘శ్రీహనుమన్ జయ హనుమాన్ 

జయ జయ హనుమాన్''

ఆంజనేయం మహావీరం -బ్రహ్మ విష్ణు శివాత్మకం   తరుణార్క ప్రభంశాతం -రామదూతం నమామ్యహం

మర్కటేశ మహోత్సహా -సర్వశోక వినాశన శత్రూన్సంహర మాం రక్ష- శ్రియం దాపయ మే ప్రభో ||  అని చదువు కుంటూ ప్రదక్షిణలు చేయాలి.

Also Readగృహప్రవేశం ఇలా చేస్తే.. ఈ నియమాలు పాటిస్తే.. మీకంతా శుభమే..

కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కానీ ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి ‘‘యాక్రుత్తే రేభి: ప్రదక్షిణ ణై | 

శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలి.

ప్రదక్షిణ కాలంలో బ్రహ్మ చర్యం, శిరస్నానం , నేలపడక, సాత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.  

మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి.  

పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. 

అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు.

స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం, వారం నిత్యమూ చేయగలగడం మరీ మంచిది.

మంగళవార సేవ..

మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. 

అంతా కుదరని వారు మూతికయినా తప్పక పూయాలి. 

సింధూరార్చన చేయటం, 

అరటి పండ్లు నివేదించడం చేయాలి.

శనివార సేవ:..

హనుమంతుడు శనివారం జన్మించాడు, కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. 

నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. 

ఆరోజున అప్పాలు, వడ మాల వంటివి స్వామివారికి నివేదించి స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చు.

Also Readఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు

పంచ సంఖ్య..

హనుమంతుడుకి పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటిపండ్లు లేదా ఇతరములు, స్వామికి 

5 సంఖ్యంలో సమసర్పించడం స్వామివారికి 

మరింత ప్రీతికరం.

Famous Posts:

pradakshina mantra in telugu pdf, how many pradakshina in shiva temple, powerful hanuman mantra in telugu pdf, sundara hanuman mantra in telugu pdf, anjaneyam mahaveeram slokam meaning in telugu, hanuman japa mantra in telugu, sri anjaneyam slokam in telugu lyrics, hanuman slokas in telugu, lord hanuman, anjaneyaswamy

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.