Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కార్తిక పౌర్ణమి సందర్భంగా అన్నవరం గిరి ప్రదక్షిణ తేదీ మరియు సమయం - Annavaram Satyanarayana swamy Giri Pradakshina Date & Time

రత్నగిరిని

చుట్టేద్దాం రండి..

కార్తిక పౌర్ణమి సందర్భంగా సోమవారం

ఉదయం 8 గంటలకు తొలిపావంచాల వద్ద ప్రారంభం

వేలాదిగా తరలివస్తారని అంచనా, పకడ్బందీ ఏర్పాట్ల

చుట్టూ నడుచుకుంటూ వెళ్తారు.

ప్రదక్షిణ: అన్నవరం గ్రామంలోని తొలి పావంచాల (రత్నగిరి మెట్లమార్గం ప్రారంభం) వద్ద ప్రారంభమై రత్న, సత్యగిరులు చుట్టూ ప్రదక్షిణ జరుగుతుంది. ప్రారంభమైన చోటే ప్రదక్షిణ ముగుస్తుంది. గ్రామంలోని ప్రధానమార్గం మీదుగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, సాక్షిగణపతి ఆలయం మీదుగా జాతీయ రహదారిపైకి చేరు కుంటుంది. అక్కడ నుంచి బెండపూడి గ్రామానికి ముందుగా ఉన్న పోలవరం కాలువ గట్టు మీదుగా పంపా సరోవరం చెంత నున్న పంపాఘాట్ నుంచి (రత్న, సత్యగిరిలను చుడుతూ) దిగువ ఘాట్ రోడ్డు మీదుగా పాతటోల్ గేటు నుంచి తిరిగి తొలిపా వంచాల వద్దకు చేరుకుం టుంది. మార్గమధ్యంలో నాలుగు ప్రదేశాల్లో వేదికలు ( ఏర్పాటు చేశారు. ఆయా వేదికల వద్ద స్వామి, అమ్మ, వార్లను కొద్ది సేపు ఉంచు తారు.

ఎన్నిగంటలకు: ఉదయం (సోమవారం) 7.30 గంటలకు కొండపై నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో మెట్ల మార్గంలో కొండదిగువున తొలిపావంచాల వద్దకు తీసుకొస్తారు. ఇక్కడ ప్రత్యేక పూజలు అనంతరం 8 గంటలకు ప్రదక్షిణ ప్రారంభమవుతుంది.

ఎన్ని కిలోమీటర్లు: 11.5

సమయం: ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది.

ప్రదక్షిణ చేసే మార్గంలో కొంత తారు రోడ్డు ఉండగా మిగిలిన ప్రదేశం మట్టిరోడ్డు కావడం, చిన్నచిన్న రాళ్లు కాళ్లకు గుచ్చుకునే అవకా శమున్న నేపథ్యంలో గడ్డిని వేస్తున్నారు. ముందు గడ్డిని తడుపు టారు. వెనుక భక్తులు నడిచేలా ఏర్పాట్లు చేశారు.

దేవ స్థానం ఆధ్వర్యంలో 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీటి సీసాలు, యాపిల్, కమలా, అరటి పండ్లు, పాలు, మజ్జిగ, పానీయాలు, ఇతర ఆహార పదార్థాలు, ప్రసాదం పంపిణీ చేస్తారు. వైద్య సిబ్బంది. అంబులెన్స్ల ను సిద్ధం చేశారు. పలు ప్రదేశాల్లో మరుగుదొడ్లు, మూత్రవిసర్జన ఇతర ఏర్పాట్లు చేస్తు న్నారు.

సత్యదేవుడు కొలువై ఉన్న రత్న, సత్యగిరులు ఆధ్యాత్మిక, హరిత సిరులతో అలరా పదిమంది రుతున్నాయి., భూప్రదక్షిణ చేసి నంత ఫలితముంటుందని భక్తుల విశ్వాసం. కొండపై ఉండే దివ్య ఔషధ గుణాలు, ఇతర పలు జాతుల వృక్షాలు శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయని పండితులు చెబుతున్నారు.

Tags: Annavaram Satyanarayana swamy, Giri Pradakshina, Annavaram, Annavaram Temple, Annavaram Giri pradaskhina, Giri Pradaskhina 2023, Karthika Purnima

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు