Drop Down Menus

Bhagavad Gita 11th Chapter 34-44 Slokas and Meaning in Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 34-44 శ్లోకాల భావాలు

శ్రీమద్ భగవద్ గీత ఏకాదశోఽధ్యాయః
అథ ఏకాదశోఽధ్యాయః |

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్|
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ‖ 34 ‖


భావం : ఇది వరకే నేను సంహరించిన ద్రోణుడు, భీష్ముడు, జయద్రదుడు, కర్ణుని వంటి వీరులందరినీ నీవు వధించు, భయపడకు, యుద్దం చెయ్యి, శత్రువులను జయిస్తావు. 
సంజయ ఉవాచ |

ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ|
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య ‖ 35 ‖
భావం : సంజయుడు : శ్రీ కృష్ణుడి మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి, బాగా భయపడి పోయి మళ్ళీ నమస్కారం చేసి గద్గద స్వరంతో ఇలా అన్నాడు.
అర్జున ఉవాచ |

స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ|
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః ‖ 36 ‖
భావం : అర్జునుడు : హృషీకేశా! నీ మహిమను పొగుడుతూ జగత్తంతా ఆనందం, అనురాగం పొందుతున్నది. రాక్షసులు భయపడి అన్ని వైపులా పారిపోతున్నారు. సిద్దుల సంఘాలన్ని నీకు నమస్కరిస్తున్నాయి. నీ విషయంలో ఇదంతా సమంజసమే.

కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే|
అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ ‖ 37 ‖
భావం : మహాత్మా నీవు అంతంలేని వాడవు, దేవతలకు, జగత్తుకంతటికి ఆధారుడవు, శాశ్వతుడవు, సత్తు ఆసత్తు స్వరూపుడవే కాకుండా వాటికి అతితమైన అక్షరూడవు. అందరికంటే గొప్పవాడవు. బ్రహ్మదేవుడికి కూడా ఆదికారణుడవు అయిన నీకు వాళ్లేందుకు నమస్కరించరు?   


త్వమాదిదేవః పురుషః పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప ‖ 38 ‖
భావం : నీవు ఆదిశేషుడవు, పురాణపురుషుడవి, ఈ సమస్తజగత్తుకె ఆధారుడవు. సర్వమూ తెలిసినవాడవు. తెలుసుకోదగ్గవాడవు. అనంతరూపా! ఈ విశ్వమంతా పరంధామూడవైన నీతో నిండివున్నది.   

వాయుర్యమోఽగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ|
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోఽపి నమో నమస్తే ‖ 39 ‖
భావం : వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు, అతని తండ్రివి నీవే 
నీకు అనేక వేల వేల నమస్కారాలు, మళ్ళీ మళ్ళీ నమస్కారాలు. 

నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ|
అనంతవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః ‖ 40 ‖
భావం : నీకు ముందు, వెనుక అన్నీ వైపులా నా నమస్కారాలు. సర్వస్వరూపా! అపరిమిత సామర్ధ్యమూ, అమితపరాక్రమామూ కలిగిన నీవు సర్వత్ర వ్యాపించి వున్నావు. అందువల్ల స్వరూపమూ నీవే. 

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి|
అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ప్రణయేన వాపి ‖ 41 ‖
యచ్చావహాసార్థమసత్కృతోఽసి విహారశయ్యాసనభోజనేషు|
ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయమ్ ‖ 42 ‖

భావం : అచ్యుతా! నీ మహిమ తెలుసుకోలేక స్నేహితుడవనే వుద్దేశ్యం పోరాపాటునో, చనువువల్లనో కృష్ణా!యాదవా! సఖా అని నిన్ను నిర్లక్ష్యంగా పిలిచినందుకూ, కలిసిమెలిసి తిరిగేటప్పడు, పడుకున్నపుడు, ఇతరులతో వున్నపుడు, వేళాకోళంగా నిన్ను అవమానించినందుకు అప్రమేయుడవైన నిన్ను తప్పులన్నిటీని మన్నించవలసినదిగా ప్రార్ధిస్తునాను. 
  
పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్|
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ‖ 43 ‖
భావం : సాటిలేని ప్రభావం కలిగినవాడా! ఈ చరాచర ప్రపంచమంతటికి నీవు తండ్రివి, పూజ్యుడవు, గురుడవు, గురువులకు గురువుడవు, మూడులోకాలలో నీతో సమానమైనవాడే లేనప్పుడు నిన్ను మించినవాడెలా వుంటాడు ?  

తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్|
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ‖ 44 ‖
భావం : అందువల్ల ప్రభుడవు పూజ్యుడవు అయినా నీకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను అనుగ్రహించవలసినదిగా  వేడుకుంటున్నాను. దేవా! తండ్రి, కొడుకునీ, స్నేహితుడు స్నేహితుణ్ణి, ప్రియుడు ప్రియురాలినీ క్షమించినట్లు నీవు నన్ను క్షమించాలి.

11వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 11th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.