Drop Down Menus

దేవి నవరాత్రులలో రెండో రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం | Navratri 2nd Day Pooja Brahmacharini Devi

నవరాత్రుల రెండో రోజు -  సోమవారం 16 అక్టోబర్ 2023 - బ్రహ్మచారిణి పూజ

బ్రహ్మచారిణి ( గాయత్రి )

బ్రహ్మచారిణీ దుర్గా దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారం. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండోరోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి, కుడి  చేతిలో జప మాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి.

పురణ గాథ

పురాణాల ప్రకారం పార్వతీ దేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని  కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనకా, హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా, ఆమె పట్టుదలతో శివుని కోసం 5000 ఏళ్ళు తపస్సు చేసింది. తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో  తప్ప చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు  తిరిగి వివాహం చేసుకోడనీ, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు  కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీ  దేవిగా జన్మెత్తి, శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన  దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని   మన్మధుణ్ణి కోరతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు.

నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి, తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణీ అవతారంలో ఘోరతపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ, తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్యా కాలేరని భావించి శివుడు, తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీ దేవి అ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు.

ధ్యాన శ్లోకం 

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | 

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వీయుజ శుక్ల విదియ నాడు పూజిస్తారు.

రెండవ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తుంది. ఆరోజు అమ్మవారికి ఇష్టమైన పులిహోర నైవేద్యంగా పెట్టి ఆమె ఆశీర్వాదాలు పొందుతారు.

Related Posts:

నవరాత్రుల్లో 1వ రోజు చేయాల్సిన పూజ శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

నవరాత్రుల్లో 2వ రోజు  చేయాల్సిన పూజ బ్రహ్మచారిణి ( గాయత్రి )

నవరాత్రుల్లో 3వ రోజు  చేయాల్సిన పూజ చంద్రఘంట ( అన్నపూర్ణ )

నవరాత్రుల్లో 4వ రోజు  చేయాల్సిన పూజ కూష్మాండ ( కామాక్షి )

నవరాత్రుల్లో 5వ రోజు చేయాల్సిన పూజ స్కందమాత ( లలిత )

నవరాత్రుల్లో 6వ రోజు చేయాల్సిన పూజ కాత్యాయని (లక్ష్మి)

నవరాత్రుల్లో 7వ రోజు చేయాల్సిన పూజ కాళరాత్రి ( సరస్వతి )

నవరాత్రుల్లో 8వ రోజు చేయాల్సిన పూజ మహాగౌరి ( దుర్గ )

నవరాత్రుల్లో 9వ రోజు చేయాల్సిన పూజ సిద్ధిధాత్రి ( రాజ రాజేశ్వరి )

> శరన్నవరాత్రుల 10వ రోజు - విజయదశమి దుర్గాదేవీ పూజా విధానం

బ్రహ్మచారిణి, brahmacharini mantra, brahmacharini devi story, brahmacharini mantra benefits, brahmacharini mantra in telugu, brahmacharini, brahmacharini devi aarti, vijayadasami, devi navaratrulu

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON