Drop Down Menus

శ్రీ కుమారి దేవి ఆలయం | పశ్చిమ బెంగాల్ | Sri Kumari Devi Temple Information | Hooghly West Bengal | Hindu Temples Guide

శ్రీ కుమారి దేవి ఆలయం , పశ్చిమ బెంగాల్ :

ఈ ఆలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలోని ఖానకుల్-కృష్ణానగర్ వద్ద రత్నకర్ నది ఒడ్డున ఉన్న ఆనందమయీ ఆలయం అనే పేరుతో కలదు. స్థానికంగా నివసించే ప్రజలు ఇక్కడి అమ్మవారిని రత్నవళి అని పిలుస్తారు.ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. అష్టాదశ శక్తి పీఠ ఆలయాలకు ఉప ఆలయాలాలో ఈ ఆలయం ఒకటి. ప్రధామంగా మనకి 108 శక్తి పీఠాలు ఉన్న అందులో 51 ముఖ్యమైనవిగా అందులో 18 అతి ముఖ్యమైనవిగా తెలుస్తుంది.  ఈ ఆలయం 51 శక్తి పీఠం లలో ఒకటి.

ఆలయ చరిత్ర : 

పురాణాల ప్రకారం, సతీ దేవి యొక్క తండ్రి దక్ష రాజు నిర్వహించిన యాగంలో శివునికి ప్రవేశం లేదని మరియు తన భార్య అయిన సతీ దేవి కూడా అగౌరవంగా మాట్లాడడం వల్ల ఆ దేవి తన యొక్క శరీరని మంటల్లోకి దూకి ఆత్మార్పణ చేసుకుంది. దీనితో ఆగ్రహించిన శివుడు తన జటా జూటం నుంచి వీరభద్ర స్వామిని సృష్టి చేసి దక్ష యాగం మొత్తం ధ్వంసం చేస్తాను. శివుడు రుద్రునిగా మరి విలయ తాండవం చేస్తూ తన భార్య శరీరాన్ని మోసుకొని భూమి చుట్టూ పరిగెడుతున్నప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రం ఉపయోగించి శరీరాన్ని 51 భాగాలుగా విభజించాడు. ఆ 51 భాగాలలో, సతి యొక్క ‘కుడి భుజం’ ఈ ప్రదేశానికి పడిపోయింది.


ఈ విధముగా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందినది. ఈ ఆలయంలో అమ్మవారిని  'కుమారి' గా, శివుడిని 'భైరవ్' గా పూజిస్తారు. అన్ని పండుగలు రత్నవళి శక్తి పీఠంలో జరుపుకుంటారు, ముఖ్యంగా దుర్గా పూజ మరియు నవరాత్రి పండుగలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగలలో, కొంతమంది దేవుని ఆరాధనకు గౌరవం మరియు అంకితభావంగా ఉపవాస దీక్షలు చేస్తారు. ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల హృదయానికి, మనసుకు శాంతిని అందిస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారితో పాటు పరమేశ్వరుని ఆలయం కూడా దర్శించవచ్చు. శివరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహిస్తారు.

వసతి సౌకర్యాలు :

ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రైవేట్ సత్రాలు మరియు హోటల్ కు కలవు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం       : 5.30-12.00
సాయంత్రం  : 3.30-9.00

ఆలయానికి చేరుకునే విధానం :

బస్ మార్గం :

మొదట హుగ్లీ జిల్లా కి చేరుకొని అక్కడి నుంచి ఖానకుల్ గ్రామంలోని ఈ ఆలయానికి చేరుకోవాలి. కోల్‌కతా నుంచి ఈ ఆలయానికి 90 కి.మీ దూరంలో కలదు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలో హౌరా రైల్వే స్టేషన్ కలదు. రత్నవళి శక్తి పీఠం నుండి దాదాపు 74 కిలోమీటర్ల దూరంలో కలదు. 

విమాన మార్గం : 

సమీప విమానాశ్రయం  నేతాజీ సుభాస్ చంద్ర బోస్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుంచి రత్నావళి శక్తి పీఠం నుండి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో కలదు.

ఆలయ చిరునామా :

శ్రీ కుమారి దేవి ఆలయం,
ఖానకుల్ గ్రామం, 
హుగ్లీ జిల్లా,
పశ్చిమ బెంగాల్.
పిన్ కోడ్ - 712418
ఇవి చదివారా ?
Shankari Devi Temple శంఖరి శక్తిపీఠం
Kamakshi Amman Temple కాంచీపురం కామాక్షి అమ్మవారు
Jwalamukhi Temple
Chamundeshwari Temple శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం
Jogulamba Devi శ్రీ జోగులాంబ శక్తి పీఠం
Bhramaramba Mallikarjuna Temple భ్రమరాంబదేవి శక్తిపీఠం
Mahalakshmi Temple శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం
Ekveera Temple శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం
Mahakaleswar Temple శ్రీ మహాకాళిదేవి శక్తిపీఠం
Kukkuteswara Swamy Temple శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం
Biraja Temple శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం
Bhimeswara Temple శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం
Kamakhya Temple శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం
Alopi Devi Mandir శ్రీ మాధవేశ్వరీ దేవీ శక్తీ పీఠం
Jwalamukhi Temple
Mangla Gauri Temple శ్రీ మంగళ గౌరీ మహాశక్తీ పీఠం
Vishalakshi Temple విశాలాక్షిదేవి శక్తిపీఠం
Sharada Peeth శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం
శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం
శ్రీ నైనాదేవి శక్తిపీఠం
శ్రీ కుమారి దేవి శక్తిపీఠం
శ్రీ భ్రామరి దేవి శక్తిపీఠం
jothirlingas జ్యోతిర్లింగాలు


key Words : Sri Kumari Devi Temple Information, Famous Temples In West Bengal, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.