Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tirumala Surrounding Temples Details

Tirumala Surrounding Temples List


తిరుమల స్వామి వారి దర్శనం అయినతరువాత ఇంకా ఏమి చూడాలి అనేది చాలామందికి తెలియదు. ఏమోనండి వెళ్ళాం కాని సమయం సరిపోక వచ్చేసాం.. ఏమి ఉంటాయ్ కొండపైన అని అడుగుతుంటారు. 

మీరు తిరుమల దర్శనం లో మొదట వరాహస్వామి దర్శనం చేస్కోవాలి.. స్వామి వారి ఆలయం ఉంది కదా !.. పక్కనే కోనేరు ( స్వామి పుష్కరిణి ) ఉంది కదా ... ఆలయానికి స్వామి పుష్కరిణికి మధ్యలోంచి వెళ్తే మనం ప్రసాదం ఇచ్చే కౌంటర్ కి వెళ్తాము. అలాకాకుండా స్వామి వారి ఆలయానికి ఎడవైపు పుష్కరిణికి అనుకునే వెళ్లి ఎడవైపు తిరిగితే వరాహస్వామి ఆలయం కనిపిస్తుంది.  నేను చెప్పినది అర్ధకాకపోతే స్వామి వారి పుష్కరిణి దగ్గరకు వెళ్లి అడగండి వారు చూపిస్తారు. 
కొండపైన చాలానే తీర్ధాలు ఉన్నాయి. కొన్ని తీర్ధాలకు మామూలుగా వెళ్లడం కష్టం సాధారణ రోజుల్లో వెళ్ళడానికి వీలుపడదు. వాటిని కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే వెళ్ళడానికి అనుమతినిస్తారు. 
కొండపైన పాపనాశనం .. పాపనాశనం .. అని R.T.C బస్సు లు వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. మీరు ఆ బస్సు ఎక్కి.. up and down టికెట్ తీస్కోండి. మీరు లాస్ట్ స్టాప్ అని చెప్పేవరకు దిగకండి. పైనుంచి క్రిందకు చూసుకుంటూ వద్దురుగాని. 
పాపనాశనం : Papanashanam 

ఉదయాన్నే మీరు వెళ్ళేటట్లు ఉంటే.. ఈ తీర్ధం లోనే తీర్ధ స్నానం చేయవచ్చు. చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. తీర్ధ స్నానం అన్న విషయం గుర్తుపెట్టుకుని స్నానం చెయ్యండి. అక్కడే స్థలపురాణం బోర్డు ఉంటుంది. చూసి చదువుకుని రండి. ఈ క్రింది ఫోటో పాపనాశనం దగ్గరదే. 

మనం పాపనాశనం నుంచి ఆకాశగంగా వద్దకు బయలుదేరాలి. ఇంతకూ ముందే టికెట్ తీసుకున్నారు కాబట్టి టికెట్ సమస్య లేదు.. క్రిందకు వెళ్లే ఏ బస్సు అయినా మీరు ఎక్కవచ్చు.. 5 నిమిషాల లోపే ఆకాశగంగా వస్తుంది. మీరు దిగి ఆకాశ గంగ ను చూసి రండి. ఆకాశం లో ఉండదు ఆకాశగంగ.. మీరు కాస్త క్రిందకు దిగాలి. చుట్టూ పచ్చటి చెట్లతో చాల ప్రశాంతంగా ఉంటుంది. 
Akasaganga Teertham Tirumala

వేణుగోపాల స్వామి వారి ఆలయం : Venugopala Swamy Temple
ఆకాశగంగ తరువాత మనం వేణుగోపాల స్వామి ఆలయానికి వస్తాం. ఈ ఆలయం చాల పురాతనమైనది అని చెప్తారు. ఈ మధ్యనే కొత్తగా ఆలయం నిర్మించారు. మన ఆలయాలల్లో లేని ఆచారం ఈ ఆలయం లో ఉంది. అదేమిటంటే చేతికి తాళ్లు కట్టడం. ఒక ఆరుగురు దర్శనం అయ్యాక మనం నడిచే చోట కూర్చుని మనకు తెలియకుండానే మన చేతిని లాగి తాడు కట్టేస్తారు.. ఊరికే కాదండి 10.. 20/- తీస్కుని. గోవిందా అంటూ మనం డబ్బులు ఇచ్చేసి బయటకు రావాలి.  

Japali Teertham Tirumala

జాపాలి ఆంజనేయ స్వామి వారిని చూడాలంటే సుమారు 2 కిమీ పైనే నడవాలి. అడవిలోంచి వెళ్ళాలి .. వెళ్ళడానికి మార్గం బాగుంటుంది. చాల తక్కువ మంది భక్తులు వెళ్తుంటారు.  చివరిగా బస్సు తిరుమల మ్యూజియం దగ్గర ఆగుతుంది. 

ఇప్పడివరకు మనం చూసినవి బస్సు లో వెళ్తే చూడవచ్చు. బస్సు లో వెళ్లి చూడటానికి వీలులేనివి రెండు. ఒకటి శ్రీవారి పాదాలు .. రెండు శీలాతోరణం. వీటిని మనం చూడాలంటే కొండపైనే జీప్ లు ఉంటాయి. ఒక్కొక్కరికి 120/- తీస్కుంటున్నారు. మీరు బేరమాడే సామర్ధ్యం బట్టి 100/- కూడా వస్తారు. 

Shilatoranam Tirumala
ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి:

Click Here : 
Tirumala Surrounding Temples
Tirumala Near By Famous Temples List


tirumala surrounding temples, tirumala temples, tirumala information, famous temples in tirumala, tirumala temple information in telugu, temple timings, accommodation details, hindu temples guide.com

Comments

Post a Comment