Drop Down Menus

దేవి నవరాత్రులలో మూడవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం| Navratri 3rd Day Pooja Chandraghanta

నవరాత్రులలో మూడవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం - మంగళవారం 17 అక్టోబర్ 2023 -  చంద్రఘంట పూజ

చంద్రఘంట ( అన్నపూర్ణ ) 

చంద్రఘంటా దుర్గా,  దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది.

పురాణ గాథ

శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న  తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన  మేనకా దేవి, హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత,  ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి  వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది.  అప్పుడు  అమ్మవారు  చంద్రఘంటాదేవి  రూపంలో శివునకు కనిపించి,  తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం  మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని  వేషంలో,  లెక్కలేనన్ని  నగలతో తయారవుతాడు.   అప్పుడు  ఆమె కుటుంబసభ్యులు,  స్నేహితులు, బంధువులూ భయం  పోయి  శివుణ్ణి  వివాహానికి  ఆహ్వానిస్తారు.  ఆ  తరువాత  శివ,పార్వతులు  వివాహం చేసుకుంటారు.  అలా  ప్రజల  భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది.

శివ, పార్వతుల కుమార్తె కౌషికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ, నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. అమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ, నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.

ధ్యాన శ్లోకం

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| 

ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

మూడవరోజు అమ్మవారు చంద్రఘంటా అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఆ రోజు అమ్మవారికి  కొబ్బరి అన్నం, పాయసం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలి.

Related Posts:

నవరాత్రుల్లో 1వ రోజు చేయాల్సిన పూజ శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

నవరాత్రుల్లో 2వ రోజు  చేయాల్సిన పూజ బ్రహ్మచారిణి ( గాయత్రి )

నవరాత్రుల్లో 3వ రోజు  చేయాల్సిన పూజ చంద్రఘంట ( అన్నపూర్ణ )

నవరాత్రుల్లో 4వ రోజు  చేయాల్సిన పూజ కూష్మాండ ( కామాక్షి )

నవరాత్రుల్లో 5వ రోజు చేయాల్సిన పూజ స్కందమాత ( లలిత )

నవరాత్రుల్లో 6వ రోజు చేయాల్సిన పూజ కాత్యాయని (లక్ష్మి)

నవరాత్రుల్లో 7వ రోజు చేయాల్సిన పూజ కాళరాత్రి ( సరస్వతి )

నవరాత్రుల్లో 8వ రోజు చేయాల్సిన పూజ మహాగౌరి ( దుర్గ )

నవరాత్రుల్లో 9వ రోజు చేయాల్సిన పూజ సిద్ధిధాత్రి ( రాజ రాజేశ్వరి )

> శరన్నవరాత్రుల 10వ రోజు - విజయదశమి దుర్గాదేవీ పూజా విధానం

చంద్రఘంట, chandraghanta story, chandraghanta mantra, chandraghanta, chandraghanta meaning, chandraghanta aarti, chandraghanta in telugu, vijayadasami, devi navaratrulu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments